MLA Kalava పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం: ఎమ్మెల్యే కాలవ
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:34 AM
రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలో శనివారం ఆయన పర్యటించి పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు.
డీ.హీరేహాళ్, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పేదరిక నిర్మూలనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, ఇందుకు సీఎం చంద్రబాబు అహర్నిశలు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు అన్నారు. మండలంలో శనివారం ఆయన పర్యటించి పలు గ్రామాల్లో వివిధ అభివృద్ధి పనులను భూమి పూజ చేసి ప్రారంభించారు.
తొలుత కాదలూరు గ్రామంలో రూ. 3.20 కోట్ల వ్యయంతో చేపట్టనున్న బ్రిడ్జి, రోడ్డు నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. అనంతరం అక్కడే టీడీపీ సభ్యత్వ నమోదుపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రం అభివృద్ధి బాటలో నడపడం చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అందుకే కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీఎం ప్రజల సంక్షేమానికి తీవ్ర కృషి చేస్తున్నారని తెలిపారు. చెప్పిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ.. వాటి ఫలాలు ప్రతి లబ్ధిదారుడికి అందేలా పాలన సాగిస్తున్నారన్నారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ సభ్య త్వ నమోదును భారీఎత్తున చేయాలని కార్యకర్తలకు, నాయకులకు సూచించారు. సభ్యత్వం పొందడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. తర్వాత మల్లికేతి గ్రామంలో రూ. 1.15 కోట్ల వ్యయంతో సీసీరోడ్డు ని ర్మాణానికి, హులికల్లులో రూ. 85 లక్షల వ్యయంతో సీసీరోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే భూమిపూజ చేశా రు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు నాగళ్లి రాజు, మండల కన్వీనర్ హనుమంతరెడ్డి, క్లస్టర్ ఇనచార్జి మోహనరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు గంగాధర, డీఈ సుధాకర్‌నాయక్, ఏఈ సుధాకర్ ఆయా గ్రామాల సర్పంచులు , టీడీపీ నాయకులు ్జ్జకార్యకర్తలు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..