Share News

DFO జింకల బారి నుంచి పంటలను కాపాడుతాం: డీఎఫ్‌ఓ

ABN , Publish Date - Dec 18 , 2024 | 01:07 AM

జింకల బారి నుంచి పంటలను కాపాడతామని జిల్లా అటవీ అధికారి విజ్ఞేష్‌ తెలిపారు. మండలంలోని పెద్ద కొట్టాల పల్లి గ్రామ పరిధిలోని వివిధ రకాల పంటలను మంగళవారం ఆయన పామిడి షెక్షన అధికారి, పందికుంట బీట్‌ అధికారి సతీ్‌షతో కలిసి పరిశీలించారు.

 DFO జింకల బారి నుంచి పంటలను కాపాడుతాం: డీఎఫ్‌ఓ
రైతులతో మాట్లాడుతున్న డీఎఫ్‌ఓ విజ్ఞేష్‌

విడపనకల్లు, డిసెంబరు 17(ఆంధ్రజ్యోతి): జింకల బారి నుంచి పంటలను కాపాడతామని జిల్లా అటవీ అధికారి విజ్ఞేష్‌ తెలిపారు. మండలంలోని పెద్ద కొట్టాల పల్లి గ్రామ పరిధిలోని వివిధ రకాల పంటలను మంగళవారం ఆయన పామిడి షెక్షన అధికారి, పందికుంట బీట్‌ అధికారి సతీ్‌షతో కలిసి పరిశీలించారు.


పప్పుశనగ, కంది పంటలలో జింకలు నాశనం చేసిన ప్రదేశాలను పరిశీలించారు. పంటలపై జింకల దాడి ఎక్కువైందని రైతులు అధికారులకు తెలిపారు. అవి పంటలను తినేస్తున్నాయని వాపోయారు. డీఎ్‌ఫఓ మాట్లాడుతూ జింకలు దాదాపుగా 15 ఏళ్ల నుంచి అడవుల్లో వృద్ధి చెందాయని, వాటిని ఒక్కసారిగా తరలించటం సాధ్యం కాదని అన్నారు. మండలంలోని అటవీ ప్రాంతంలో ఎన్ని జింకలు ఉంటాయో అంచనావేసేందుకు ఓ ప్రణాళిక సిద్దం చేస్తామన్నారు. వేసవిలో వాటిని తరలించే ప్రయత్నం చేస్తామని అన్నారు. ప్రతి ఏటా కొన్నింటిని పట్టి అటవీ ప్రాంతాల్లో వదిలేస్తామని చెప్పారు. కార్యక్రమంలో పెద్ద కొట్టాలపల్లి రైతులు తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Dec 18 , 2024 | 01:07 AM