SOCIETY EMPLOYEES: నష్టాల నుంచి సొసైటీలను గట్టెక్కించండి
ABN , Publish Date - Oct 05 , 2024 | 12:06 AM
నష్టాల్లో ఉన్న సొసైటీలకు గట్టెక్కించాలని ఏపీ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డిని కలిసిన సొసైటీ ఉద్యోగుల సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు.
అనంతపురం క్లాక్‌టవర్, అక్టోబరు 4: నష్టాల్లో ఉన్న సొసైటీలకు గట్టెక్కించాలని ఏపీ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్) ఉద్యోగుల సంఘం నాయకులు కోరారు. శుక్రవారం రాజధాని అమరావతిలో ఆప్కాబ్ ఎండీ శ్రీనాథ్‌రెడ్డిని కలిసిన సొసైటీ ఉద్యోగుల సంఘం నాయకులు వినతిపత్రం అందజేశారు. నాయకులు మాట్లాడుతూ సొసైటీలకు ఆదాయంలో రావాల్సిన నిధులు, రైతులకు దక్కాల్సిన వడ్డీ రాయితీ రూ.2.80కోట్లు వెంటనే చెల్లించాలని కోరారు. గత ఐదేళ్లుగా సొసైటీలకు కేంద్రప్రభుత్వం చెల్లించే వడ్డీ రైతులకు ఇవ్వకుండా ఏడీసీసీ బ్యాంకులోనే తొక్కిపెట్టారని, విషయం బయటకు రాకుండా అధికారులు యత్నిస్తున్నారని ఫిర్యాదు చేశారు. సొసైటీలలో నిధులు లేక, ఉద్యోగులకు వేతనాలు చెల్లించక మూతపడే దయనీయ స్థితిలో ఉన్నాయని తెలిపారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం జారీ చేసిన సొసైటీ ఉద్యోగుల హెచఆర్ పాలసీని నేటికీ అమలు చేయడం లేదన్నారు. వెంటనే సొసైటీల సమస్యలు పరిష్కరించాలని కోరారు. దీనికి ఎండీ స్పందిస్తూ పరిశీలించి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఆంజనేయులు, హరికృష్ణ్డ ఎండీని కలిసిన వారిలో ఉన్నారు.