Share News

COMMISSIONER: ఉద్యోగ భద్రత కల్పించండి

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:26 PM

వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఢిల్లీరావును ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం విజయవాడలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఢిల్లీరావును ఎంపీఈఓల సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్‌, నాయకులు శంకర్‌, భాస్కర్‌ నాయక్‌ వినతి పత్రం అందజేశారు.

COMMISSIONER: ఉద్యోగ భద్రత కల్పించండి
Leaders of the MPEOs Association presenting the petition to the Commissioner

అనంతపురం అర్బన, జూలై 22: వ్యవసాయ శాఖలో కాంట్రాక్టు పద్ధతిలో కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఎంపీఈఓలకు ఉద్యోగ భద్రత కల్పించి న్యాయం చేయాలని వ్యవసాయ శాఖ కమిషనర్‌ ఢిల్లీరావును ఆ సంఘం నాయకులు కోరారు. సోమవారం విజయవాడలోని వ్యవసాయ శాఖ కమిషనరేట్‌లో ఢిల్లీరావును ఎంపీఈఓల సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డి ప్రసాద్‌, నాయకులు శంకర్‌, భాస్కర్‌ నాయక్‌ వినతి పత్రం అందజేశారు. 1000 హెక్టార్లకు ఒక ఎంపీఈఓను నియమించేలా చూడాలన్నారు. చిత్తూరు జిల్లాలో ఓడీపై పనిచేస్తున్న జిల్లాకు చెందిన ఎంపీఈఓలకు తిరిగి అనంతలోనే పోస్టింగ్‌లు ఇప్పించాలని కోరారు. ఓడీపై వెళ్లకపోవడంతో టర్మినేట్‌ చేసిన వారికి తిరిగి ఉద్యోగ అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆర్బీకే సిబ్బంది తరహాలోనే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. సకాలంలో రెన్యువల్‌ చేయడంతోపాటు ప్రతినెలా వేతనాన్ని చెల్లించేలా చూడాలని కోరారు. ఇందుకు కమిషనర్‌ సానుకూలంగా స్పందించినట్లు వారు తెలిపారు.

Updated Date - Jul 22 , 2024 | 11:26 PM