Share News

POSTAL RALLY: పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స మేళాపై ర్యాలీ

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:22 AM

జిల్లాలోని ప్రతి పోస్టాఫీసులో 11, 12 తేదీలలో పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ఇన్సూరెన్సపై ప్రత్యేక మేళాను నిర్వహిస్తున్నట్లు హిందూపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు.

POSTAL RALLY: పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స మేళాపై ర్యాలీ
Postal staff conducting the rally

ధర్మవరం, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రతి పోస్టాఫీసులో 11, 12 తేదీలలో పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స, రూరల్‌ పోస్టల్‌ లైఫ్‌ఇన్సూరెన్సపై ప్రత్యేక మేళాను నిర్వహిస్తున్నట్లు హిందూపురం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. శనివారం పోస్టల్‌ అధికారులు, సిబ్బంది ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆర్పీఎల్‌ఐని 1995 సంవత్సరంలో ప్రవేశపెట్టిందన్నారు. ఈ పాలసీని 19 నుంచి 55 సంవత్సరాల వయస్సున్న వారు పొందవచ్చన్నారు. రూ.10వేల నుంచి రూ.10లక్షల వరకు తీసుకోవచ్చన్నారు. గ్రామీణప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలందరూ ఈ పాలసీని తీసుకోవడానికి అర్హులన్నారు. ప్రభుత్వంవారు పీఎల్‌ఐ పాలసీని 1884 సంవత్సరంలో ప్రవేశపెట్టిందన్నారు. పీఎల్‌ఐని రూ.20వేల నుంచి రూ.50లక్షలు వరకు పొందవచ్చన్నారు. డాక్టర్‌లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐటీఐ, పాలిటెక్నిక్‌ చేసినవారు ప్రైవేటు సంస్థలో పనిచేస్తున్న వారు అన్ని ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నవారు ఈ స్కీమ్‌లో చేరవచ్చాన్నారు. ఇన్సురెన్సలు కేంద్ర ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తోందని, వాటికి భద్రత కూడా ఉంటాయన్నారు. ఐపీఓ రాజేశ, పోస్టుమాస్టర్‌ సంతోష్‌, సిబ్బంది బుద్దన్న పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:22 AM