Festival: వైభవంగా రాములోరి కల్యాణం
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:23 AM
శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక రామబురుజువద్ద వెలసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగం నాగప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కల్యాణోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు మెహర్‌బాబాతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు.
పెనుకొండ, ఏప్రిల్ 21 : శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక రామబురుజువద్ద వెలసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగం నాగప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కల్యాణోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు మెహర్‌బాబాతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం గావించారు.
రేపు రామాలయంలో...: శ్రీరామనవమి వేడుకల్లో భాగంగా స్థానిక బోయపాళ్యంలోని రామాలయంలో మంగళవారం స్వామివారి కల్యాణోత్సవాన్ని ఘనం గా నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఓ ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం 3గంటలకు చక్కభజన, కోలాటం ఉంటాయని తెలిపారు. అనంతరం సాయంత్రం 6గంటలకు సీతారామ కల్యాణోత్సవం, ఉట్లపరుష, నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ పెద్దఎత్తున పాల్గొని స్వామికృపకు పాత్రులు కావాలని వారు కోరారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ వార్తల కోసం...