Home » Festive Season Sales
ప్రతి ఏడాది రకరకాల టపాసులు మార్కెట్‌లోకి వస్తున్నాయి. ధరలు కూడా ప్రతి ఏడాది పెరుగుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలు దీపావళికి టపాసులు కొనాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. మరోవైపు అసలు ధరకంటే టపాసుల ధరను అమాంతం పెంచి కొందరు విక్రయిస్తున్నారు. అన్ని దుకాణాల్లో టపాసుల ధరలు..
దీపావళి పండుగ వచ్చిందంటే చాలు. దేశవ్యాప్తంగా మార్కెట్‌లు, మాల్స్, బంగారు, వెండి షోరూమ్‌లు ఎక్కడ చూసినా జనాలే కనిపిస్తారు. కానీ ఈ కొనుగోళ్ల విషయంలో మాత్రం మధ్యతరగతి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ సూచనలు జారీ చేసింది. ఎందుకనేది ఇక్కడ చుద్దాం.
బక్రీద్ పండుగ నేపథ్యంలో పొట్టేళ్లు, మేక పోతులు భారీ ధర పలికాయి. సాధారణ పరిస్థితులలో గరిష్ఠంగా రూ.20 వేల వరకూ పలికే వీటిని పండుగ కోసం రూ.70 వేల వరకూ వెచ్చించి కొనుగోలు చేశారు. బక్రీద్ కొనుగోళ్ల కారణంగా అనంతపురం నగరంలోని మార్కెట్ యార్డులో పశువుల సంత శనివారం కళకళలాడింది. ఆత్మకూరుకు చెందిన నాగార్జున అనే వ్యాపారి ఓ పొట్టేలును రూ.48 వేలకు...
మండలం రత్నగిరిలో వెలిసిన శ్రీ కొల్లాపురి మహాలక్ష్మీ అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం హారతులు ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర ప్రాంతం నుంచేకాక సమీప కర్ణాటక ప్రాంతం నుంచి వందలాది మంది భక్తులు పాల్గొన్నారు.
పట్టణంలోని బోయగేరిలో వెలసిన రామాలయంలో బుధవారం నిర్వహంచిన ఉట్లపరుష కార్యక్రమం భక్తులను అమితంగా ఆకట్టుకుంది. ఆలయంలో ఉదయం అర్చ కులు పంచాంగం శేషప్పస్వామి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం ఆలయ ప్రాంగణంలో కమిటీ అధ్యక్షుడు, మాజీ సర్పంచ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఉట్లపరుష నిర్వహించారు.
శ్రీరామనవమి ఉత్సవాలను పురస్కరించుకుని స్థానిక రామబురుజువద్ద వెలసిన ఆంజనేయస్వామి దేవాలయంలో సీతారామ కల్యాణోత్స వాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగం నాగప్రసాద్ శర్మ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి కల్యాణోత్సవం ఘనంగా సాగింది. ఈ కార్యక్రమానికి ఆలయ అర్చకులు ప్రసాద్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుడు మెహర్‌బాబాతోపాటు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని కల్యాణోత్సవాన్ని తిలకించారు.
ఆకాశం అన్ని ఆకారాలు, పరిమాణాలలో రంగురంగుల గాలిపటాలతో నిండి ఆహ్లాదంగా ఉంటుంది.