Share News

GBC జీబీసీకి సాగు నీరు విడుదల

ABN , Publish Date - Sep 21 , 2024 | 12:46 AM

గుంతకల్లు బ్రాంచ కెనాల్‌కు శుక్రవారం సాగునీటిని జీబీసీ అధికారులు మండల రైతుల సహాయంతో విడుదల చేశారు. జేబీసీకి పూర్తి స్థాయిలో సాగునీరు అందక ఆయకట్టు భూముల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. దీనిపై గత గురువారం ఆంధ్రజ్యోతిలో చివరికి నష్టమేనా అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.

GBC జీబీసీకి సాగు నీరు విడుదల
కాలువలో పూడిక తీయిస్తున్న అధికారులు

- మంత్రి కేశవ్‌ ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టిన అధికారులు

విడపనకల్లు, సెప్టెంబరు 20: గుంతకల్లు బ్రాంచ కెనాల్‌కు శుక్రవారం సాగునీటిని జీబీసీ అధికారులు మండల రైతుల సహాయంతో విడుదల చేశారు. జేబీసీకి పూర్తి స్థాయిలో సాగునీరు అందక ఆయకట్టు భూముల్లో పంటలు ఎండిపోయే దుస్థితి నెలకొంది. దీనిపై గత గురువారం ఆంధ్రజ్యోతిలో చివరికి నష్టమేనా అనే శీర్షికన కథనం ప్రచురితమైంది.


ఇందుకు స్పందించిన రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్‌ గురువారం అనంతపురంలో జరిగిన ఐఏబీ సమావేశం అనంతరం హెచఎల్‌సీ, జీబీసీ అధికారులతో సాగు నీటి విషయం చర్చించారు. హెచఎల్‌సీలో నీటి సామర్థ్యాన్ని పెంచి జీబీసీకి చివరి ఆయకుట్టు వరకూ సాగు నీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు ఆయా అధికారులు తెలిపారు. ఎన్ని అడ్డంకులున్నా తొలగించి చివరి ఆయకట్టు వరకూ సాగు నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని తెలిపారన్నారు. దీంతో జీబీసీ అధికారులు శుక్రవారం ఉదయం మండలంలోని జీబీసీ జీరో బై జీరో వద్దకు చేరుకున్నారు. వీరికి తోడుగా టీడీపీ మండల నాయకులు, ఆర్‌ కొట్టాల, డోనేకల్లు, విడపనకల్లు, పాల్తూరు గ్రామాల రైతులు చేరుకుని కాలువలో అడ్డుగా ఉన్న చెట్లను తొలగించారు. అధికారులు ఎస్కవేటర్‌ను తెప్పించి కాలువలో పేరుకుపోయిన మూడు, నాలుగు, అడుగుల మేర ఉన్న పూడికను తీయించారు. అలాగే అడ్డుగా ఉన్న చెట్లు, రాళ్లు, ముళ్ల కంపలను తొలగించారు. ప్రస్తుతం 250 నుంచి 300 క్యూసెక్కుల వరకూ సాగు నీరు విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. కా ర్యక్రమంలో ఈఈ వెంకటరమణ, డీఈఈ రఘుచరణ్‌, ఏఈఈలు మంజు నాథ, రాజశేఖర్‌, పల్లవి, పవన, టీడీపీ నాయకులు చల్లా ఎర్రిస్వామి, మద్దిపాట్ల శ్రీనివాసులు, బొజ్జప్ప, మారయ్య, సర్వోత్తమ్‌ తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Sep 21 , 2024 | 12:46 AM