కాలువల్లో పూడిక తొలగించండి
ABN , Publish Date - May 20 , 2024 | 11:53 PM
నగరంలోని కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలని సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలకసంస్థ కమిషనర్ మేఘస్వరూ్‌పను కలిసి వినతిపత్రం సమర్పించారు.
అనంతపురం కల్చరల్, మే 20: నగరంలోని కాలువల్లో పేరుకుపోయిన పూడికను తొలగించాలని సీపీఎం నగర 1వ కమిటీ కార్యదర్శి రామిరెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం నగరపాలకసంస్థ కమిషనర్ మేఘస్వరూ్‌పను కలిసి వినతిపత్రం సమర్పించారు. రామిరెడ్డి మాట్లాడుతూ... రెండు సంవత్సరాల క్రితం అనంతపురం నగరంలో ఎన్నడూ లేని రీతిలో వరదలు రావడం, ఆ వరదల్లో కొన్ని వందల కుటుంబాలు ఆర్థికంగా నష్టపోవడం జరిగిందన్నారు.
దీనికి ప్రధానంగా నడిమివంక, మరువవంకలో పూడిక తీయకపోవడమేనని తెలిపారు. రానున్నది వర్షాకాలం కాబట్టి కాలువల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని తొలగించి, పూడికను తీసేయాలని, తద్వారా వర్షాలు వచ్చినా ప్రజలకు నష్టం జరగకుండా ఉంటుందని అన్నారు. రిషిత స్కూల్ దగ్గర ఉన్న బ్రిడ్జి, కృష్ణ టాకీస్ వద్దనున్న బ్రిడ్జి, కేర్ అండ్ క్యూర్ ఆస్పత్రి వద్దనున్న బ్రిడ్జిలలో చెత్త ఎక్కువగా పేరుకుపోయిందని, వీటిని వెంటనే బాగు చేయాలని కోరారు. దీనికి కమిషనర్ స్పందిస్తూ త్వరలో స్పెషల్‌డ్రైవ్ నిర్వహించి పూడికతీత పనులు చేయిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీపీఎం నగర నాయకులు ప్రకాష్, మసూద్, జీవ, వెంకటేష్, ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.