Share News

RJG: అక్రమ డెప్యుటేషన్లపై ఆర్జేడీ విచారణ

ABN , Publish Date - Nov 05 , 2024 | 12:14 AM

జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అక్రమ డెప్యుటేషన్లపై అనేకమంది కొనసాగుతున్నారనే ఫిర్యాదులపై కడప ప్రాంతీయ వైద్యాధికారి(ఆర్జేడీ) రామగిడ్డయ్య విచారణ చేశారు.

RJG: అక్రమ డెప్యుటేషన్లపై ఆర్జేడీ విచారణ
Kadapa Regional Medical Officer Ramagiddaiah is investigating

అనంతపురం టౌన, నవంబరు 4(ఆంధ్రజ్యోతి): జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో అక్రమ డెప్యుటేషన్లపై అనేకమంది కొనసాగుతున్నారనే ఫిర్యాదులపై కడప ప్రాంతీయ వైద్యాధికారి(ఆర్జేడీ) రామగిడ్డయ్య విచారణ చేశారు. వైద్య శాఖ కమిషనర్‌ ఆదే శాల మేరకు ఆయన సోమవారం జిల్లా వైద్యశాఖ కార్యాలయానికి వచ్చారు. డీఎం హెచఓ డాక్టర్‌ ఈబీ.దేవి, ఏఓ గిరిజా మనోహర్‌ల ద్వారా జిల్లా కార్యాలయంలో ఎంతమంది డెప్యుటేషన్లపై ఉన్నారు? ఎక్కడ పనిచేస్తున్నారు? ఇక్కడ ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు? ఎలాంటి ఉత్తర్వులు ఇచ్చారు? రికార్డులలో ఏమని నమోదు చేశారు? వారిహాజరు ఎలా పరిగణించారు? తదితర వివరాలను తెలుసుకున్నారు. అక్రమంగా ఎవరిని డెప్యుటేషన్లు వేసుకోలేదని, కార్యక్రమాల నిర్వహణ సమయంలో కొంతమందిని తాత్కాలికంగా నియమించుకొని పనిచేయించుకుంటు న్నట్లు డీఎంహెచఓ, ఏఓలు వివరించారు. అనంతరం ఎన్జీఓ నాయకులు విచారణాధికారిని కలిసి పని సర్దుబాటుకు మాత్రమే కొందరిని నియమించుకున్నారని అక్రమ డెప్యుటేషన్లు లేవని వినతిపత్రం అందజేశారు. కాగా తాత్కాలిక ఆర్డర్లు పొందినవారు ఇక్కడ పనిలేకపోయినా కొందరు ఆఫీ్‌సలో ఉంటూ కాలక్షేపం చేస్తున్నారనే ఆరోపణలు ఉండేవి. విచారణాధికారి వస్తున్నారనే సమాచారంతో వాళ్లంత తమ ప్లేస్‌కు వెళ్లి పోవడం గమనార్హం. ఇక్కడ సేకరించిన సమాచారాన్ని ఉన్నతాధికారులకు పంపుతానని విచారణాధికారి రామగిడ్డయ్య మీడియాకు తెలిపారు.

Updated Date - Nov 05 , 2024 | 12:14 AM