Share News

CRIME: దారి దోపిడీదొంగల అరెస్ట్‌

ABN , Publish Date - Jun 01 , 2024 | 11:42 PM

గుంతకల్లు-గుత్తి ఎనహెచ 67 హైవే నక్కనదొడ్డి గ్రామసమీపంలోని సుధాకర్‌ రెడ్డి కోళ్లఫారం వద్ద లారీ డ్రైవర్‌, క్లినర్‌ను బెదరించిన సంఘటనలో ఇద్దరు దొంగలను రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను శనివారం సీఐ మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హొసపేటలో ఓ ఫ్యాక్టరీ నుంచి లారీ స్లాగ్‌ లోడుతో జమ్మలమడుగులోని దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టిరీకి గురువారం సాయంత్రం బయలుదేరారు.

CRIME: దారి దోపిడీదొంగల అరెస్ట్‌
Police are disclosing the arrest details of the accused

గుంతకల్లుటౌన, జూన 1: గుంతకల్లు-గుత్తి ఎనహెచ 67 హైవే నక్కనదొడ్డి గ్రామసమీపంలోని సుధాకర్‌ రెడ్డి కోళ్లఫారం వద్ద లారీ డ్రైవర్‌, క్లినర్‌ను బెదరించిన సంఘటనలో ఇద్దరు దొంగలను రూరల్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ వివరాలను శనివారం సీఐ మహేశ్వర్‌రెడ్డి వెల్లడించారు. కర్ణాటక రాష్ట్రం హొసపేటలో ఓ ఫ్యాక్టరీ నుంచి లారీ స్లాగ్‌ లోడుతో జమ్మలమడుగులోని దాల్మియా సిమెంట్‌ ఫ్యాక్టిరీకి గురువారం సాయంత్రం బయలుదేరారు. రాత్రి నక్కనదొడ్డి గ్రామ సమీపంలోని సుధాకర్‌ రెడ్డి కోళ్లఫారం వద్ద బొలెరో వాహనం వెనుక నుంచి ఓవర్‌టేక్‌ చేసి లారీని అడ్డుకున్నారు. డ్రైవర్‌ లారీని ఐఓసీ డిపో వద్ద పక్కన ఆపారు. బొలెరో వాహనంలో నుంచి ముగ్గురు వ్యక్తులు డ్రైవర్‌ ఇసాక్‌, క్లీనర్‌ సునీల్‌తో వాదనకు దిగి వారిని కిందకు లాగి చితకబాదారు. వారి వద్ద డబ్బులు లేకపోవడంతో రెండు సెల్‌ఫోన్లను లాక్కొని పరారయ్యారు. లారీ డ్రైవర్‌ ఇసాక్‌ శుక్రవారం రూరల్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూరల్‌ సీఐ మహేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐ సురేష్‌ దారి దోపిడీ దొంగల కోసం గాలింపు చేపట్టామన్నారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు నలుగురు వ్యక్తులు ముగ్గులు వ్యక్తులు తెల్ల బొలెరో వాహనంలో గుత్తి నుంచి బళ్లారికి వెళ్తుండగా గొల్లలదొడ్డి క్రాస్‌ వద్దవారిని గుర్తించామన్నారు. గుత్తి ఆర్‌ఎ్‌సకు చెందిన చిన్న కందుకూరి ఆజేయ్‌, బెల్లంప్రశాంత, గుత్తిమండలం లచ్చానుపల్లికి చెందిన వడుగూరు ఆదర్శలను అరెస్ట్‌ చేశామన్నారు. మరో వ్యక్తి జీవనకుమార్‌ పరారీలో ఉన్నాడన్నారు. వీరిని కోర్టులో హాజరుపరుస్తామని సీఐ తెలిపారు.

Updated Date - Jun 01 , 2024 | 11:42 PM