Share News

FOOD INSPECTER RIDING: కుళ్లిన చికెన... కల్తీ నూనె..!

ABN , Publish Date - Jun 26 , 2024 | 11:30 PM

పట్టణంలో ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ బు ధవారం పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా నిర్వహించిన కళ్లుతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్ర ఆధ్వర్యంలో దేవాన్ష రెస్టారెంట్‌, విజయదుర్గ, చాంద్‌ హోటళ్లలో ఆకస్మిక దాడులు చేశారు.

FOOD INSPECTER RIDING: కుళ్లిన చికెన... కల్తీ నూనె..!
food inspector putting the stored chicken in a dustbin

ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ తనిఖీల్లో బట్టబయలు

కళ్యాణదుర్గం, జూన 26: పట్టణంలో ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ బు ధవారం పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు నిర్వహించగా నిర్వహించిన కళ్లుతిరిగే వాస్తవాలు బయటపడ్డాయి. ఫుడ్‌ ఇనస్పెక్టర్‌ రామచంద్ర ఆధ్వర్యంలో దేవాన్ష రెస్టారెంట్‌, విజయదుర్గ, చాంద్‌ హోటళ్లలో ఆకస్మిక దాడులు చేశారు. దాడుల్లో నాసిరకం కల్తీనూనె వినియోగించి వినియోగదారులకు ఆహారం అందిస్తున్నారని బయటపడింది. దాంతోపాటు దేవాన్ష రెస్టారెంట్లో ఫ్రిజ్‌లో నిల్వ వుంచిన కోడి మాంసాన్ని గుర్తించారు. చికెన మాంసంలో టేస్టింగ్‌ సాల్ట్‌, ఫుడ్‌ కలర్‌ అధిక మోతాదులో వినియోగిస్తే ప్రజలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని గుర్తించారు. నిల్వవుంచిన చికెనను బయట పడేశారు. దేవాన్ష రెస్టారెంట్‌కు నోటీసులు అందించారు. నిబంధనలను అతిక్రమించి హోటళ్లు, రెస్టారెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Jun 26 , 2024 | 11:30 PM