Share News

ACB: పరుగో.. పరుగు..

ABN , Publish Date - Dec 21 , 2024 | 12:22 AM

స్థానిక సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న అధికారి, ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఏసీబీ అధికారులు వెనుదిరిగారు.

ACB: పరుగో.. పరుగు..
Run.. Run..

ముందస్తు సమాచారంతో అధికారి, ఉద్యోగులు పరార్‌

బుక్కపట్నం, డిసెంబరు 20(ఆంధ్రజ్యోతి): స్థానిక సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు వస్తున్నారని తెలుసుకున్న అధికారి, ఉద్యోగులు అక్కడి నుంచి పరారయ్యారు. కార్యాలయంలో ఎవరూ లేకపోవడంతో ఏసీబీ అధికారులు వెనుదిరిగారు. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో అక్రమ రిజిస్ట్రేషన్లు విపరీతంగా సాగుతున్నాయని ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు.. సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంపై నిఘా వేశారు. తిరుపతికి చెందిన అధికారులు ఈనెల 19వ తేదీన కార్యాలయ పరిసరాల్లో గమనించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం సబ్‌ రిజిసా్ట్రర్‌ రామ్మోహన చౌదరి, ఉద్యోగులు, అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విధుల్లో ఉన్నారు. సాయంత్రం 4 గంటల తరువాత ఏసీబీ అధికారులు వస్తున్నారన్న సమాచారంతో సబ్‌ రిజిసా్ట్రర్‌, సిబ్బంది పరారయ్యారు. కాసేపటికి తిరుపతికి చెందిన ఏసీబీ అధికారులు సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలోకి వచ్చారు. అధికారి, సిబ్బంది లేకపోవడంతో వెనుదిరిగారు. విషయం తెలుసుకున్న డాక్యుమెంట్‌ రైటర్లు సైతం గదులకు తాళాలు వేసుకుని, వెళ్లిపోయారు. కాగా, ఏసీబీ దాడుల విషయంపై సబ్‌ రిజిసా్ట్రర్‌ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఫోన స్విచాఫ్‌ వస్తోంది. ఓ ఉద్యోగిని అడగ్గా.. రెవెన్యూ సదస్సుకు వెళ్లినట్లు చెప్పుకురావడం గమనార్హం.

Updated Date - Dec 21 , 2024 | 12:22 AM