Share News

FOREST DEPARTMENT: ముడుపులా.. జరిమానానా?

ABN , Publish Date - Jul 12 , 2024 | 12:07 AM

‘ముడుపులు కావాలా..? జరిమానా కట్టాలా..? ఏదో ఒకటి నిర్ణయించుకోండి. నెల నెలా వచ్చి మామూళ్లు తీసుకుపోతారు. మళ్లీ తనిఖీలకు వచ్చి జరిమానా విధిస్తారు. ఇట్లైతే కుదరదు. ఏదో ఒక్కటే చెల్లిస్తాం. డిసైడ్‌ చేసుకోండి..’ అని సా మిల్లుల యజమానులు అటవీశాఖలోని ‘మామూలు’ అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సా మిల్లులు నిర్వహించుకుంటామని, తమ వైపు తప్పు ఉంటే జరిమానాలు కట్టేందుకు సిద్ధమని అంటున్నారు. వారి తిరుగుబాటుతో అటవీశాఖ అనంతపురం రేంజ్‌ పరిధిలో జరుగుతున్న అక్రమాలు బయట పడుతున్నాయి. అటవీ శాఖ జిల్లా ...

FOREST DEPARTMENT: ముడుపులా..  జరిమానానా?

ఏదో ఒకటే చెల్లిస్తాం.. రెండూ అంటే కుదరదు

పద్ధతిగా ఉంటాం.. తనిఖీలకు రండి..

ముడుపులు కావాలంటే.. తనిఖీలను ఆపేయండి

తేల్చి చెప్పిన సా మిల్లుల నిర్వాహకులు..?

అటవీశాఖలో అక్రమార్కుల ఆదాయానికి గండి

అనంతపురం న్యూటౌన, జూలై 11: ‘ముడుపులు కావాలా..? జరిమానా కట్టాలా..? ఏదో ఒకటి నిర్ణయించుకోండి. నెల నెలా వచ్చి మామూళ్లు తీసుకుపోతారు. మళ్లీ తనిఖీలకు వచ్చి జరిమానా విధిస్తారు. ఇట్లైతే కుదరదు. ఏదో ఒక్కటే చెల్లిస్తాం. డిసైడ్‌ చేసుకోండి..’ అని సా మిల్లుల యజమానులు అటవీశాఖలోని ‘మామూలు’ అధికారులకు స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం సా మిల్లులు నిర్వహించుకుంటామని, తమ వైపు తప్పు ఉంటే జరిమానాలు కట్టేందుకు సిద్ధమని అంటున్నారు. వారి తిరుగుబాటుతో అటవీశాఖ అనంతపురం రేంజ్‌ పరిధిలో జరుగుతున్న అక్రమాలు బయట పడుతున్నాయి. అటవీ శాఖ జిల్లా కార్యాలయంలో పనిచేసే సిబ్బందిలో కొందరు భారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. సా మిల్లుల యూనియన నాయకులు ఎదురు దాడికి సిద్ధమయ్యారు.


గోడ దెబ్బ.. చెంప దెబ్బ

అటవీశాఖలో అక్రమాలకు తావులేదని డీఎ్‌ఫఓ వినీత కుమార్‌ అంటున్నారు. ఎవరికీ ఒక్క రూపాయ కూడా మామూళ్లు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. నిబంధనలు పాటిస్తే చాలని బహిరంగంగా చెబుతున్నారు. కానీ.. ఇలా అయితే తమ జేబులు నిండేదెలా అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు అక్రమార్కులు. డీఎ్‌ఫఓ కోసం తనిఖీలు చేసి జరిమానాలు విధిస్తున్నారు. తమకోసం నెల నెలా వెళ్లి మామూళ్లు పుచ్చుకుంటున్నారు. దీంతో సా మిల్లుల నిర్వాహకులకు గోడ దెబ్బ.. చెంప దెబ్బ.. రెండూ పడుతున్నాయి. లబోదిబో అంటున్నారు. ఇట్లయితే కుదరదని, ఏదో ఒకటే ఎంచుకోవాలని అక్రమార్కులను డిమాండ్‌ చేస్తున్నారు.

మాది మాకు ఇవ్వాల్సిందే..

‘డీఎ్‌ఫఓ చెబితే మాత్రం.. ముడుపులు ఇవ్వరా..? అదేం కుదరదు. కార్యాలయంలో ఖర్చులు ఉంటాయి. వాటిని ఎవరు భరిస్తారు..? మాది మాకు ఇవ్వాల్సిందే..’ అని వసూళ్లకు వెళుతున్నారు సిబ్బందిలో కొందరు. దీంతో చేసేది లేక చాలామంది సా మిల్లుల నిర్వాహకులు ముడుపులు కట్టి పంపిస్తున్నారని సమాచారం. ‘ఫీల్డ్‌ తనిఖీలకు వెళ్లాల్సిందే. అక్కడ ఏదైనా తేడా కనిపిస్తే చర్యలు తప్పవు..’ అని డీఎ్‌ఫఓ హెచ్చరిస్తున్నారు. దీంతో ఉద్యోగులు సా మిల్లుల తనిఖీలకు వెళుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉంటే జరిమానా విధిస్తున్నారు. డీఎ్‌ఫఓకు రిపోర్ట్‌ ఇవ్వడానికి ఇలా చేయక తప్పడం లేదని అంటున్నారు. ఇక్కడే సమస్య మొదలైంది. ‘ఇలా ఎన్నాళ్లు..?’ అని సా మిల్లుల నిర్వాహకులు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం సా మిల్లులను నిర్వహించుకుంటామని, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అంటున్నారు. ముడుపులు ఇవ్వాలంటే అక్రమాలను చూసీ చూడనట్లు వదిలేయాల్సిందే అని పరోక్షంగా చెబుతున్నారు. కాదూ కూడదు అంటే.. అక్రమాల గురించి ఉన్నతాధికారులకు చెబుతామని కొందరు హెచ్చరించినట్లు తెలిసింది. ‘అటు డీఎ్‌ఫఓ.. ఇటు సామిల్లుల నిర్వాహకులు..! మధ్యలో తమ అక్రమార్జనకు


గండిపడేలా ఉంది..’ అని అక్రమార్కులు తెగ ఆవేదన చెందుతున్నారని సమాచారం. పరిస్థితి ఏమిటో తెలియాలంటే.. డీఎ్‌ఫఓ స్వయంగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉందని పలువురు అంటున్నారు.

నేరుగా వచ్చి చెప్పేశారా..?

ముడుపులు.. జరిమానాల సంగతి అటో ఇటో తేల్చుకోవాలని సా మిల్లుల యూనియన నాయకులు భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఇటీవలే కొందరు నాయకులు రేంజర్‌ కార్యాలయానికి వచ్చి ఏదో ఒకటి నిర్ణయించుకోవాలని తెగేసి చెప్పినట్లు సమాచారం. ‘మీరు తనిఖీలకు వచ్చేటట్లు అయితే మామూళ్ల కోసం రాకండి. ఎప్పుడైనా తనిఖీలు చేసుకోండి. మా వైపు తప్పుంటే అపరాధ రుసుం ఎంతైనా విధించండి. చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం. అలా కాకుండా రెండూ కావాలంటే మీ ఉన్నతాధికారులకు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటివరకు ఎవరెవరికి ఎంతెంత ఇచ్చామో చిట్టా విప్పాల్సి ఉంటుంది..’ అని హెచ్చరించినట్లు తెలిసింది. దీంతో పీల్డ్‌ స్థాయి సిబ్బంది అయోమయంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. ఈ పంచాయితీ నేపథ్యంలో ఒత్తిడి తట్టుకోలేక ఓ అధికారి వ్యక్తిగత పనుల పేరిట సెలవులో వెళ్లినట్లు తెలిసింది.

పొసగడం లేదు..

అటవీశాఖ జిల్లా కార్యాలయంలో ఓ అధికారికి, సిబ్బందికి పొసగడం లేదు. కింది స్థాయి సిబ్బందితో తాను పని చేయించలేనని ఆ అధికారి డీఎ్‌ఫఓకు చెప్పినట్లు సమాచారం. అయితే, ఆయన వద్ద తామూ పనిచేయలేమని దిగువస్థాయి సిబ్బంది కూడా అంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. క్షేత్రస్థాయికి వెళ్లి.. నిబంధనలకు విరుద్ధంగా ఉన్నవాటికి తాము జరిమానా విధిస్తున్నామని, ఆ చలానాలో సంతకాల కోసం వెళితే.. తాము వేసిన జరిమానా కంటే ఎక్కువగా రాస్తున్నారని కొందరు ఏబీఓలు, ఎఫ్‌బీఓలు అంటున్నారు. పీల్డ్‌లో తాను అక్రమార్కులను పట్టుకుని జరిమానా వసూలు చేసినట్లు డీఎ్‌ఫఓకు చూపించుకునేందుకు ఆ అధికారి అలా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 12 , 2024 | 12:07 AM