ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్న ప్రజాసంఘాలు
ABN , Publish Date - May 21 , 2024 | 11:52 PM
పెన్నానది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తెలిపినా స్పందించలేదన్నారు.
హిందూపురం, మే 21: పెన్నానది నుంచి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్‌ను సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు మంగళవారం అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా పదుల సంఖ్యలో ట్రాక్టర్‌లను యథేచ్ఛగా తరలిస్తున్నారన్నారు. దీనిపై అధికారులకు తెలిపినా స్పందించలేదన్నారు. మంగళవారం సీపీఐ, ప్రజా సంఘాల నాయకులు సంతేబిదునరూరువద్ద పెన్నానది నుంచి ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్‌ను అడ్డుకున్నారు. 9 ట్రాక్టర్లను రూరల్ పోలీసులకు అప్పగించారు. వారు మాట్లాడుతూ అక్రమంగా మూడు నెలలుగా వేబిల్లులు చూపుతూ నిత్యం 30 ట్రాక్టర్లతో ఇసుకను తరలిస్తున్నారన్నారు. దీనిపై జిల్లా అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా స్పందించలేదన్నారు. ఈ ప్రాంతంలో రైతులకు నీరులేక ఇబ్బందులు పడుతున్నారని, ఇసుక తరలిస్తే భూగర్భజలాలు ఇంకిపోతాయన్నారు. విషయం తెలుసుకుని సెబ్ అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని స్టేషనకు ట్రాక్టర్లను తరలించారు. సీపీఐ నాయకులు వినోద్, తూమకుంట పారిశ్రామికవాడ కార్మిక సంఘం నాయకులు రవికుమార్, నాగరాజు, అబూబకర్, జబీవుల్లా, అంజాద్, బాబు, మూర్తి, గంగాధర్ పాల్గొన్నారు.