Share News

Urusu : మస్తాన వలికి గంధం సమర్పణ

ABN , Publish Date - Aug 02 , 2024 | 12:51 AM

పాత గుంతకల్లులో వెలసిన హజరత సయ్యద్‌ మస్తాన వలి 389 ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం గంధం వేడుకను ఘనంగా నిర్వహించారు. గణాచారి నాగభూషణం రెడ్డి ఇంటి నుంచి వేకువాజామున అశ్వం మీద స్వామి వారి గంధాన్ని తీసుకుని బయలుదేరారు. మేళాతాళాల మధ్య దివిటీల వెలుగులో దర్గాకు చేరుకున్నారు. శివాలయం వద్ద ఉన్న బావిలో నీటిని తీసుకువచ్చి భక్తులు అశ్వం పాదాలకు పోసి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం ...

 Urusu : మస్తాన వలికి గంధం సమర్పణ
Sandalwood in the presence of Swami

గుంతకల్లు టౌన, ఆగస్టు 1: పాత గుంతకల్లులో వెలసిన హజరత సయ్యద్‌ మస్తాన వలి 389 ఉరుసు ఉత్సవాలను పురస్కరించుకుని గురువారం గంధం వేడుకను ఘనంగా నిర్వహించారు. గణాచారి నాగభూషణం రెడ్డి ఇంటి నుంచి వేకువాజామున అశ్వం మీద స్వామి వారి గంధాన్ని తీసుకుని బయలుదేరారు. మేళాతాళాల మధ్య దివిటీల వెలుగులో దర్గాకు చేరుకున్నారు. శివాలయం వద్ద ఉన్న బావిలో నీటిని తీసుకువచ్చి భక్తులు అశ్వం పాదాలకు పోసి మొక్కు తీర్చుకున్నారు. అనంతరం గంధాన్ని స్వామి వారికి సమర్పించారు. స్వామి పేరిట ముజావర్లు ప్రత్యేక పార్థనలు చేశారు. వేడుకకు తరలివచ్చిన భక్తులతో దర్గా ఆవరణం, పాత గుంతకల్లు రోడ్డు కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి చాదర్‌, చక్కెర, లడ్డు, టెంకాయలను సమర్పించారు. మరికొందరు భక్తులు దర్గా ఆవరణలో కందూరి చేశారు. వక్ఫ్‌ బోర్డ్డు ఆధ్వర్యంలో దర్గాలో భక్తులకు అన్నదానం చేశారు. డీఎస్పీ శివభాస్కర్‌ రెడ్డి, సీఐలు గణేష్‌, రామసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. వక్ఫ్‌బోర్డు ఇనస్పెక్టర్‌ షేక్‌ రహీంహుసేన, ఎల్లార్తి ఈఓ షేక్‌ ఇమ్రాన తదితరులు పాల్గొన్నారు.


గంధాన్ని స్వామి వారికి సమర్పించారు. స్వామి పేరిట ముజావర్లు ప్రత్యేక పార్థనలు చేశారు. వేడుకకు తరలివచ్చిన భక్తులతో దర్గా ఆవరణం, పాత గుంతకల్లు రోడ్డు కిక్కిరిసిపోయాయి. వివిధ ప్రాంతాల భక్తులు స్వామి వారికి చాదర్‌, చక్కెర, లడ్డు, టెంకాయలను సమర్పించారు. మరికొందరు భక్తులు దర్గా ఆవరణలో కందూరి చేశారు. వక్ఫ్‌ బోర్డ్డు ఆధ్వర్యంలో దర్గాలో భక్తులకు అన్నదానం చేశారు. డీఎస్పీ శివభాస్కర్‌ రెడ్డి, సీఐలు గణేష్‌, రామసుబ్బయ్య, మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును ఏర్పాటు చేశారు. వక్ఫ్‌బోర్డు ఇనస్పెక్టర్‌ షేక్‌ రహీంహుసేన, ఎల్లార్తి ఈఓ షేక్‌ ఇమ్రాన తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 02 , 2024 | 12:51 AM