Share News

AITUC : వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళన

ABN , Publish Date - Aug 05 , 2024 | 11:29 PM

నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నాం.. వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని జిల్లా సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజే్‌షగౌడు, మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది.

AITUC : వేతనాల కోసం పారిశుధ్య కార్మికుల ఆందోళన
AITUC leaders and workers raising slogans in the hospital premises

అనంతపురం టౌన, ఆగస్టు 5: నాలుగు నెలలుగా వేతనాలు అందక అవస్థలు పడుతున్నాం.. వెంటనే జీతాలు చెల్లించి ఆదుకోవాలని జిల్లా సర్వజన ఆస్పత్రిలో పారిశుధ్య కార్మికులు ఆందోళన చేపట్టారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రాజే్‌షగౌడు, మెడికల్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రకాష్‌ ఆధ్వర్యంలో ఆందోళన కొనసాగింది. ఆస్పత్రిలోకి వెళ్లే పాత ముఖద్వారం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. నాయకులు ప్రకాష్‌, రాజేష్‌ గౌడు మాట్లాడుతూ పారిశుధ్య కార్మికుల పట్ల ఏజెన్సీ నిర్వాహకులు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. మూడేళ్లుగా ఏ సమస్యను పరిష్కరించలేదని ఆగ్రహించారు. జీఓ ప్రకారం వేతనాలు ఇవ్వాలని కోరుతున్నా పట్టించుకోకపోగా మళ్లీ నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా మానసిక వేదనకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు. వేతనానికి సరిపడా పీఎఫ్‌ కూడా జమచేయకుండా కార్మికుల శ్రమను దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. అధికారులకు చెబుతు న్నా పట్టించుకోక పోవడం దారుణమన్నారు. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని, లేనిపక్షంలో పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్‌ఎంఓ డాక్టర్‌ పద్మజను కలిసి వినతి నత్రం అందించారు. ఏఐటీయూసీ నగర అధ్యక్ష కార్యదర్శులు చిరంజీవి, కృష్ణుడు, మనోహర్‌, వెంకటేష్‌, కాంతమ్మ, రామాంజనేయులు, భార్గవి, మంజుల పాల్గొన్నారు.

Updated Date - Aug 05 , 2024 | 11:30 PM