Share News

ORPHANAGE: అనాథాశ్రమ స్థలాన్ని కాపాడండి

ABN , Publish Date - Jul 22 , 2024 | 11:29 PM

పంచాయతీ పరిధిలోని ముస్లిం మైనార్టీ కాలనీలో అనాథాశ్రమం (ఆల్‌ పైగా- మే గరీబ్‌ నవాజ్‌ మదర్‌సా) కబ్జా కాకుండా కాపాడాలని కాలనీ వాసులు మున్నా, అబ్దుల్‌ రహీమ్‌, మహబుబ్‌ బాషా, ఇబ్రహీం, ఇర్షాద్‌, మహమ్మద్‌బాషా, షేక్షావలి కోరారు.

ORPHANAGE: అనాథాశ్రమ స్థలాన్ని కాపాడండి
Colony people showing land

రాప్తాడు, జూలై 22: పంచాయతీ పరిధిలోని ముస్లిం మైనార్టీ కాలనీలో అనాథాశ్రమం (ఆల్‌ పైగా- మే గరీబ్‌ నవాజ్‌ మదర్‌సా) కబ్జా కాకుండా కాపాడాలని కాలనీ వాసులు మున్నా, అబ్దుల్‌ రహీమ్‌, మహబుబ్‌ బాషా, ఇబ్రహీం, ఇర్షాద్‌, మహమ్మద్‌బాషా, షేక్షావలి కోరారు. వారు మాట్లాడుతూ 2005లో 119 సర్వే నంబర్‌లో అప్పటి ప్రభుత్వం ముస్లిం మైనార్టీ 117 మంది పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించిందన్నారు. కాలనీలో స్థానికుల సంక్షేమం కోసం మసీదు, పాఠశాల, అంగనవాడీ కేంద్రం, అనాథాశ్రమం నిర్మించుకునేందుకు ప్రభుత్వం స్థలం కేటాయించిందన్నారు. అనాథాశ్రమం కోసం 21 సెంట్లు కేటాయించింది. దీని నిర్మాణానికి నిధులు మంజూరు చేయకపోవడంతో స్థలం ఖాళీగా ఉందన్నారు. ఆ స్థలాన్ని మైనార్టీ కాలనీలో నివాసం ఉంటున్న ఖాజీ పీరా, అమానుల్లా అనే వ్యక్తులు నకిలీ ఇంటి పట్టాలు సృష్టించి ఇతరులకు విక్రయిస్తున్నారన్నారు. ఆ స్థలంలో సరిహద్దు రాళ్లు పాతేందుకు సిద్ధమవుతున్నారన్నారు. స్థలాన్ని కాపాడాలని రాప్తాడు తహసీల్దార్‌కు, జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయంలో ప్రజాఫిర్యాదుల పరిష్కార కార్యక్రమంలో అందచేశామన్నారు. రెవెన్యూ అధికారులు అనాథాశ్రమ స్థలం కాబ్జా కాకుండా కాపాడాలని కోరారు.

Updated Date - Jul 22 , 2024 | 11:29 PM