SP : సా్ట్రంగ్ రూమ్‌ల భద్రత పరిశీలన
ABN , Publish Date - May 16 , 2024 | 12:14 AM
ఈవీఎంలను భ ద్రపరిచిన సా్ట్రంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఏ ర్పాట్లను ఎస్పీ మాధవ రెడ్డి పరిశీలించారు. ఆ యన బుధవారం నా యనపల్లి వద్ద ఉన్న బిట్ కళాశాలలోని స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏ ర్పాట్లను పరిశీలించి, వారికి సూచనలు అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్‌రూమ్‌ను తనిఖీ చేశారు. స్ర్టాంగ్ రూమ్ లవద్ద కేంద్ర సాయుధ బలగాలు ఆర్మీ రిజర్వ్‌డ్ బలగాలు, సివిల్ పోలీసు బలగాలు 24గంటలపాటు మోహరించి ఉంటాయన్నారు.
హిందూపురం, మే 15 : ఈవీఎంలను భ ద్రపరిచిన సా్ట్రంగ్ రూమ్‌ల వద్ద భద్రత ఏ ర్పాట్లను ఎస్పీ మాధవ రెడ్డి పరిశీలించారు. ఆ యన బుధవారం నా యనపల్లి వద్ద ఉన్న బిట్ కళాశాలలోని స్ర్టాంగ్ రూమ్‌ల వద్ద మూడంచెల భద్రత ఏ ర్పాట్లను పరిశీలించి, వారికి సూచనలు అందించారు. అక్కడ ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు, కమాండ్ కంట్రోల్‌రూమ్‌ను తనిఖీ చేశారు. స్ర్టాంగ్ రూమ్ లవద్ద కేంద్ర సాయుధ బలగాలు ఆర్మీ రిజర్వ్‌డ్ బలగాలు, సివిల్ పోలీసు బలగాలు 24గంటలపాటు మోహరించి ఉంటాయన్నారు.
144సెక్షన అమలు లో ఉంటుందన్నారు. ప్రతి స్ర్టాంగ్ రూమ్ పరిసరాల్లో సీసీటీవీ కెమెరాలతో ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. విద్యుత అంతరాయం లేకుండా జనరేటర్ సౌక ర్యం కల్పించామన్నారు. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చేనెల 4న ఓట్ల లెక్కింపు ముగిసేవరకు సీసీ కెమెరాల్లో రికార్డు అయిన దృశ్యాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తామన్నారు. ఎవరైనా అపోహాలు సృష్టిస్తే, తప్పుడు సమాచారాలను నమ్మి ఏవైనా అవాంఛ నీయ సంఘటనలకు పాల్పడితే అలాంటి వారిపై తీవ్రంగా చర్యలు తీసు కుంటామన్నారు. ఎస్పీ వెంట డీఎస్పీ కంజక్షన, రిజర్వ్ డీఎస్పీ విజయ్‌కుమార్, సీఐలు, ఎస్‌ఐలు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....