Share News

DIESES: వ్యాధులు ప్రబలకుండా చూడండి

ABN , Publish Date - Jul 26 , 2024 | 12:14 AM

గ్రామీణ ప్రాంత ప్రజలు సీజనల్‌ వ్యాధులబారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ ప్రభాకర్‌ రావు ఆదేశించారు. డీఎల్‌పీఓ సుమన జయంతితో కలిసి గురువారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. డీపీఆర్‌సీ కో-ఆర్డినేటర్‌ సౌజన్య, ఈఓఆర్డీ మాధవీలత తదితరులు హాజరయ్యారు.

DIESES: వ్యాధులు ప్రబలకుండా చూడండి
DPO Prabhakar Rao speaking in staff meeting

అనంతపురం న్యూటౌన, జూలై 25: గ్రామీణ ప్రాంత ప్రజలు సీజనల్‌ వ్యాధులబారిన పడకుండా చర్యలు తీసుకోవాలని డీపీఓ ప్రభాకర్‌ రావు ఆదేశించారు. డీఎల్‌పీఓ సుమన జయంతితో కలిసి గురువారం తన చాంబర్‌లో సమావేశం నిర్వహించారు. డీపీఆర్‌సీ కో-ఆర్డినేటర్‌ సౌజన్య, ఈఓఆర్డీ మాధవీలత తదితరులు హాజరయ్యారు. వ్యాధులు ప్రబలకుండగా చేపట్టాల్సిన చర్యలపై సమీక్ష నిర్వహించారు. జిల్లా, మండల, గ్రామస్థాయి కమిటీల ఏర్పాటు, పీఆర్‌వన యాప్‌ సేవల గురించి చర్చించారు. వ్యాధులను కట్టడి చేసేందుకు ప్రభుత్వం కొత్తగా యాప్‌ను ప్రవేశపెట్టిందని, దీని గురించి క్షేత్రస్థాయి సిబ్బందికి అవగాహన కల్పించాలని సూచించారు. ఈ నెల 25 నుంచి ఆగస్టు 10 వరకు క్షేత్రస్థాయిలో కార్యాక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం షెడ్యూల్‌ ఇచ్చిందని తెలిపారు. పంచాయతీ స్థాయిలో సమస్యలను గుర్తించి.. యాప్‌లో రిజిస్టర్‌ చేశామని వివరించారు. ఇందులోని సమస్యలను పరిష్కరించి, ఆధారాలను యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. నీటి కాలుష్య నివారణకు క్రమం తప్పకుండా ఈఎల్‌ఎ్‌సఆర్‌ క్లీనింగ్‌, క్లోరినేషన తదితర ప్యూరిఫికేషన చర్యలు చేపట్టాలని సూచించారు. పారిశుధ్యం మెరుగుపడేలా తగిన చర్యలు చేపట్టాలని అన్నారు.

Updated Date - Jul 26 , 2024 | 12:14 AM