Share News

sports సౌతజోన ఖోఖోపోటీలకు ఎంపిక

ABN , Publish Date - Dec 24 , 2024 | 01:18 AM

పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండవ చదువుతున్న బీ పవిత్ర సౌతజోన ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మయ్య సోమవారం తెలిపారు.

sports సౌతజోన ఖోఖోపోటీలకు ఎంపిక
పవిత్ర

గుంతకల్లుటౌన, డిసెంబరు 23(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఎస్కేపీ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ రెండవ చదువుతున్న బీ పవిత్ర సౌతజోన ఖోఖో పోటీలకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ లక్ష్మయ్య సోమవారం తెలిపారు.


ఖోఖో విభాగంలో యూనివర్శిటీ స్ధాయిలో ప్రతిభ కనబరిచి సౌతజోన పోటీలకు ఎంపికైందన్నారు. కేరళలోని కాలికట్‌లో ఈనెల 27నుంచి 31 వరకు జరిగే సౌతపోటీలో పాల్గొంటుందన్నారు. పవిత్రను పీడీ సురేష్‌, అధ్యాపకులు సోమవారం అభినందించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం...

Updated Date - Dec 24 , 2024 | 01:18 AM