Share News

MPEO'S: అనంతకు తిరిగి పంపించండి

ABN , Publish Date - Aug 28 , 2024 | 11:33 PM

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓడీ పై పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ఎంపీఈఓలను తిరిగి ఉమ్మడి అనంత జిల్లాకు పంపించాలని ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌కు ఎంపీఈఓల సంఘం నాయకులు కోరారు.

MPEO'S: అనంతకు తిరిగి పంపించండి
Union leaders of MPEOs explaining the problems to the Chief Secretary

అనంతపురం అర్బన, ఆగస్టు 28: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఓడీ పై పనిచేస్తున్న వ్యవసాయ శాఖ ఎంపీఈఓలను తిరిగి ఉమ్మడి అనంత జిల్లాకు పంపించాలని ఆ శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ రాజశేఖర్‌కు ఎంపీఈఓల సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు బుధవారం తిరుపతిలో నిర్వహించిన వికసిత ఆంధ్రా-2047 కార్యక్రమానికి హాజరైన ఆయనకు ఎంపీఈఓల సంఘం రాయలసీమ జోన అధ్యక్షుడు రెడ్డిప్రసాద్‌, నాయకులు శంకర్‌, భాస్కర్‌నాయక్‌ వినతి పత్రం అందజేశారు. గత ప్రభుత్వ హయాంలో అవసరం లేకుండానే అనంత జిల్లాలో పనిచేస్తున్న ఎంపీఈఓలను ఉమ్మడి చిత్తూరు జిల్లాకు ఓడీపై పంపారన్నారు. అప్పటి నుంచి గత్యంతరంలేని పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ పనిచేస్తున్నామన్నారు. ఐదు మాసాలుగా పెండింగ్‌లోని వేతనాలు మంజూరు చేసి, తమ సర్వీ్‌సను రెన్యూవల్‌ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇందుకు ఆయన స్పం దిస్తూ.. సచివాలయాల క్రమబద్దీకరణ తర్వాత తక్షణమే సొంత జిల్లాలకు పంపిస్తామని హామీ ఇచ్చారు. శేషు, నాగ, గౌరి, శ్రీలక్ష్మి, కుళ్లాయమ్మ, భార్గవి, వాణి పాల్గొన్నారు.

Updated Date - Aug 28 , 2024 | 11:34 PM