Share News

AGITATION: బహిరంగంగా ఉరి తీయాలి

ABN , Publish Date - Aug 18 , 2024 | 12:08 AM

కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఏఐఎ్‌సబీ, వీఎనఐవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలువురు జూనియర్‌ వైద్యులు, విద్యార్థులు టవర్‌క్లాక్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు.

AGITATION: బహిరంగంగా ఉరి తీయాలి
Leaders of student unions performing a candlelight vigil at the Gandhi statue

అనంతపురం ప్రెస్‌క్లబ్‌, ఆగస్టు17: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితులను బహిరంగంగా ఉరితీయాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శనివారం ఏఐఎ్‌సబీ, వీఎనఐవీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పలువురు జూనియర్‌ వైద్యులు, విద్యార్థులు టవర్‌క్లాక్‌ సమీపంలోని గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన చేశారు. ఏఐఎ్‌సబీ జిల్లా ప్రధానకార్యదర్శి పాపిరెడ్డిపల్లి పృథ్వి, వీఎనఐవీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. ఈ హత్యలో కీలక వ్యక్తులు ఉన్నారనేది యావత భారతదేశానికి అర్థమవుతోందన్నారు. నిందితులను వెంటనే బహిరంగంగా ఉరితీయాలన్నారు.

వైద్యులకు రక్షణకు కఠిన చట్టాలు రూపొందించాలి

అనంతపురం సెంట్రల్‌: వైద్య విద్యార్థులు, వైద్యులకు రక్షణగా కఠిన చట్టాలు రూపొందించాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్‌చేశారు. శనివారం కోల్‌కతలో వైద్యురాలిపై హత్యాచారాన్ని ఖండిస్తూ పీడీఎ్‌సఓ, ఏబీవీపీ నాయకులు వేరువేరుగా ర్యాలీ నిర్వహించారు. పీడీఓ్‌సఓ మల్లీశ్వరి, అస్ర్‌ఫవలి, ఏబీవీపీ యచేంద్ర, అఖిల్‌, జశ్వంత, అశ్వర్థ, సంపత, అభి, సుధీర్‌, విజయ్‌, నితిన పాల్గొన్నారు.


ఆర్డీటీలో కొవ్వొత్తుల ప్రదర్శన

అనంతపురం క్లాక్‌టవర్‌: మహిళలకు రక్షణ కల్పించాలని, కోల్‌కతా మహిళా డాక్టర్‌పై హత్యాచారానికి నిరసనగా శనివారం సాయంత్రం స్థానిక ఆర్డీటీ ప్రధాన కార్యాలయంలో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఆర్డీటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అన్నే ఫెర్రర్‌, ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌, మహిళా సాధికారత డైరెక్టర్‌ విశాలాఫెర్రర్‌లతో పాటు ఉద్యోగులు శాంతియుతంగా కొవ్వొత్తులను ప్రదర్శించారు.

శింగనమల: కోల్‌కతాలో వైద్యురాలిపై హత్యాచారం దారుణమని తరిమెల ప్రాథమిక ఆరోగ్యకేంద్ర వైద్యాధికారి శంకర్‌నాయక్‌ అన్నారు. శనివారం వైద్య సిబ్బందితో కలిసి ఆరోగ్య కేంద్రం ఎదుట హత్యాచార నిందితులను వెంటనే శిక్షించాలని నిరసన వ్యక్తం చేశారు. శింగనమల కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో వైద్యురాలిపై హత్యాచారం చేసిన నిందితులను వెంటనే శిక్షించాలని సిబ్బంది ఆంజనేయలు నాయక్‌. రంగనాయకులు, రమ్యతేజ, మానస, పుష్షలత ర్వాలీ చేపట్టి తహసీల్దార్‌కు వినతి పత్రం అందించారు. అనంతరం అంబేడ్కర్‌ విగ్రహం వద్ద మానవహారం ఏర్పాటు చేశారు.


అనంతపురం న్యూటౌన: కోల్‌కతా ప్రభుత్వ ఆస్పత్రిలో నైట్‌డ్యూటీలో ఉన్న వైద్యురాలిపై జరిగిన హత్యాచారానికి నిరసనగా ఇండియన మెడికల్‌ అసోషియేషన ఇచ్చిన పిలుపునకు మద్దతుగా జిల్లా కేంద్రంలోని శ్రీనేత్ర వైద్యశాల వైద్యులు, సిబ్బంది కొవ్వొత్తులతో సంఘీభావం తెలిపారు. వైద్యశాల యాజమాన్యం దాదాగాంధీతో పాటు వైద్యులు కేదార్‌నాథ్‌, కిరణ్‌, రూహియా, దివ్యశ్రీ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

రాప్తాడు: కోల్‌కతాలో వైద్యురాలిపై అత్యాచారం, హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని వైద్యాధికారి శివకృష్ణ, ఎంపీడీఓ సాల్మనరాజ్‌ డిమాండ్‌ చేశారు. వైద్యురాలి హత్యకు నిరసనగా రాప్తాడులో వైద్య సిబ్బంది నిరసన తెలిపారు. స్థానిక పీహెచసీ నుంచి బస్టాండు వరకూ ర్యాలీ చేపట్టారు. ఈఓఆర్డీ నరసింహారెడ్డి, సీహెచఓ శివప్రసాద్‌, సూపర్‌వైజర్‌ నరసింహ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Aug 18 , 2024 | 12:09 AM