Share News

SINARE: ప్రగతిశీల మానవతావాద కవి సినారె

ABN , Publish Date - Jul 30 , 2024 | 12:05 AM

తెలుగు భాషకు వెలుగులు నింపిన ప్రగతిశీల మానవతావాద కవి సినారె అని పలువురు వక్తలు కొనియాడారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సినారెగా పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టర్‌ సి నారాయణరెడ్డి 93వ జయంతిని మహాకవి గుర్రం జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశాలాంధ్ర బుక్‌హై్‌సలో నిర్వహించారు.

SINARE: ప్రగతిశీల మానవతావాద కవి సినారె
Writers paying tribute at Sinare Chitrapatam

అనంతపురం కల్చరల్‌, జూలై 29: తెలుగు భాషకు వెలుగులు నింపిన ప్రగతిశీల మానవతావాద కవి సినారె అని పలువురు వక్తలు కొనియాడారు. జ్ఞానపీఠ పురస్కార గ్రహీత, సినారెగా పేరు ప్రఖ్యాతలు గడించిన డాక్టర్‌ సి నారాయణరెడ్డి 93వ జయంతిని మహాకవి గుర్రం జాషువా సాహిత్య పీఠం ఆధ్వర్యంలో సోమవారం స్థానిక విశాలాంధ్ర బుక్‌హై్‌సలో నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్కేయూ తెలు గు శాఖ అకడమిక్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌ నానీల నాగేంద్ర మాట్లాడుతూ సినారె తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. జాషువా సాహిత్యపీఠం ప్రధాన కార్యదర్శి నాగలింగయ్య మాట్లాడుతూ సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన నారాయణరెడ్డి అత్యున్నత జ్ఞానపీఠ్‌ అవార్డు పొందే స్థాయికి ఎదిగిన తీరు ఎంతోమందికి ఆదర్శదాయకమని కొనియాడారు. పూజారి ఈరన్న, అనంత సాహితీ ప్రస్థానం అధ్యక్షుడు గంగిరెడ్డి అశ్వత్థరెడ్డి, షేక్‌ రియాజుద్దీన, టీవీ రెడ్డి, నిమ్మల వరప్రసాద్‌, పాటిల్‌ హరీష్‌, చెట్ల ప్రవీణ్‌, శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 12:06 AM