SMC ELECTIONS : ఎస్‌ఎంసీ ఎన్నికలు ప్రశాంతం
ABN , Publish Date - Aug 08 , 2024 | 11:50 PM
పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. నియోజకవర్గంలోని హిందూపురం మండలం మలుగూరు, లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల మినహాయించి మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. చైర్మన, వైస్ చైర్మన సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు.
హిందూపురం, ఆగస్టు 8 : పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికల ప్రక్రియ గురువారం ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గంలోని మూడు మండలాలతోపాటు పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు సజావుగా జరిగాయి. నియోజకవర్గంలోని హిందూపురం మండలం మలుగూరు, లేపాక్షి మండలం మైదుగోళం పాఠశాల మినహాయించి మొత్తం ప్రక్రియ పూర్తి చేశారు. చైర్మన, వైస్ చైర్మన సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. చిలమత్తూరు మండలంలో 78, లేపాక్షి మండలంలో 58, హిందూపురం మండలంలో 120 పాఠశాలల్లో ఎన్నికలు చేపట్టాగా రెండుచోట్ల మాత్రం నిలుపుదల చేశారు. మిగిలిన అన్నిచోట్ల పూర్తిచేశారు.
టీడీపీ మద్దతుదారులే గెలుపు : నియోజకవర్గంలో గురువారం జరిగిన పాఠశాల మేనేజ్మెంట్ ఎన్నికల్లో చైర్మన, వైస్ చైర్మన స్థానాలను వందశాతం టీడీపీ మద్దతుదారులే గెలుపొం దారు. ఇందులో 80శాతం పాఠశాలల చైర్మనల ఎన్నిక ఏకగ్రీవమైంది. గెలుపొందిన కమిటీలకు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శుభాకాంక్షలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. అలాగే గెలుపొందిన విద్యా కమిటీ చైర్మనలు, సభ్యులు పట్టణంలోని ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని మిఠా యిలు పంచారు. అదేవిధంగా గెలుపొందిన కమిటీలకు ఎమ్మెల్యే వ్యక్తిగత కార్యదర్శి డాక్టర్ సురేంద్ర, కో ఆర్డినేటర్ శ్రీనివాసరావు శుభాకాంక్షలు తెలిపారు. నాయకులు, కార్యకర్తలకు వారికి కృతజ్ఞతలు తెలిపారు.
హిందూపురం(సోమందేపల్లి): సోమందేపల్లి మండలంలో రెండు చో ట్ల మినహా గురువారం చేపట్టిన స్కూల్ యాజమాన్య కమిటీ ఎన్నికలు ప్ర శాంతంగా ముగిశాయి. చైర్మన, వైస్ చైర్మనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నా రు. ఈదులబళాపురం గ్రామంలో చైర్మన పదవికి ఇద్దరు పోటీపడగా టాస్‌వేసి ఒకరిని ఎన్నుకున్నారు. మేకలపల్లిలో రాజకీయ ఒత్తిళ్లతో ఎన్నికలు వాయిదాపడ్డాయి. కార్యక్రమంలో ఎంఈఓ ఆంజనే యులునాయక్, ఎంఈఓ-2 ఆనంద్, ఉపాధ్యాయులు, నాయకులు పాల్గొన్నారు.
హిందూపురం(పరిగి): పరిగి మండల వ్యాప్తంగా పాఠశాల విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండల కేంద్రంలోని జడ్పీ ఉ న్నత పాఠశాల కమిటీ చైర్మనగా అశ్వత్థనారాయణ, వైస్ చైర్మనగా ప్రమీళ మ్మను ఎన్నుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు కృపాసత్యరాజ్ ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగాయి. చైర్మనకు బీజేపీ మండల కన్వీనర్ బంగారుచంద్ర, జనసేన పార్టీ మండల కన్వీనర్ సురేష్ అభినందనలు తెలిపారు.
పెనుకొండ రూరల్/పెనుకొండ : మండల వ్యాప్తంగా 49 ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. బీసీసంక్షేమం, చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ఆదేశాల మేరకు ఎంఈఓలు సుధాకర్, చంద్రశేఖర్ పర్యవేక్షణలో చైర్మన, వైస్ చైర్మన, సభ్యులను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. గుట్టూరు పాఠశాల కమిటీ చైర్మనగా సుబ్బరాయుడు, వైస్ చైర్మన సమద్, చంద్రగిరి విశ్వనాథ్, గౌతమి, వెంకటగిరిపాళ్యం జడ్పీహెచఎస్‌కు సుకన్య, గుర్రప్ప, మునిమ డుగులో నరసింహులు, హరిజనహరిని ఎన్నుకున్నారు. అలాగే కోనాపురం పాఠశాల చైర్మనగా వడ్డి శ్రీనివాసులు, వైస్ చైర్మనగా శ్రీదేవి, అడదాకులపల్లిలో జి మహేష్‌బాబు, లక్ష్మీబాయిని ఎన్నుకు న్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కేశవయ్య, సింగిల్‌విండో మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, మాజీ సర్పంచ గుట్టూరు సూరి, కూటమి స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
గోరంట్ల: మండలంలోని 101ప్రభుత్వ పాఠశాలల కమిటీ ఎన్నికలు ప్ర శాంతంగా ముగిశాయి. ఎంపీడీఓ ప్రవీణ్‌కుమార్, ఎంఇఓలు గోపాల్, జాన రెడ్డెప్ప పర్యవేక్షణలో చైర్మన, వైస్ చైర్మనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వారిలో గోరంట్ల బాలుర ఉన్నతపాఠశాల చైర్మనగా నరసింహులు, బాలికల ఉన్నతపాఠశాలకు కుమ్మర కళావతి, ఉర్దూ పాఠశాలకు ఆయిషా, పాలస ముద్రం కట్టుబడి ఆంజనేయులు, వానవోలు రామాంజనేయులు, మల్లాపల్లి వెంకటనరేష్, బూదిలి మంజుల, మందలపల్లి నాగేంద్ర, పులేరు జయపాల్ ఎన్నిక య్యారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాల చైర్మనగా జానకిరామ య్య, ఖజాపురం కేజీబీవీకి అనితమ్మ ఎన్నికైనట్లు అధికారులు తెలిపారు.
చిలమత్తూరు: మండలంలో పాఠశాలల యాజమాన్య కమిటీ ఎన్నికలు గురువారం ప్రశాంతగా ముగిశాయి. మండలంలో మొత్తం 75 ప్రభుత్వ పాఠశాలలకు ఎన్నికలు జరిగాయి. ఎంఈఓలు నాగరాజు, సల్మాన రాజ్ పర్యవేక్షణలో చైర్మన, వైస్ చైర్మన్లను ఏకగ్రీవంగా సోమఘట్ట జిల్లా పరిషత పాఠశాలో చైర్మనగా అంజినమ్మ, వైస్ చైర్మనగా శ్రీనాథ్, కోడూరు జడ్పీ పాఠశాలకు మంజుల, నరేష్, చిలమత్తూరు తెలుగు జడ్పీ పాఠశాలకు జగదీష్, జలజను ఎన్నుకున్నారు. అలాగే చిలమత్తూరు జడ్పీ ఉర్దూ పాఠశాలకు బాబజాన, షమీమ్, కేజీబీవీకి లక్ష్మి, అరుణ, కొడికొండ జడ్పీ పాఠశాలకు షహజాన, నాగమణి, దేమకేతేపల్లి జిల్లా పరిషత పాఠశాల చైర్మనగా శోభ, వైస్ చైర్మనగా నాగేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
మడకశిరటౌన: మడకశిర నగర పంచాయతీ పరిధిలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం చైర్మన, వైస్‌చైర్మనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పట్టణంలోని ఆదిరెడ్డిపాళ్యం ప్రాథమిక పాఠశాల చైర్మనగా నళినాక్షి, వైస్ చైర్మనగా అలివేలమ్మను ఎన్నుకున్నారు. అదేవిధంగా నాగన్న కుంట పాఠశాల చైర్మనగా కవిత, వైస్‌చైర్మనగా అనిత, తొమ్మిదోవార్డు ఎంఆర్ స్కూల్‌కు భారతి, భాగ్యమ్మను ఎన్నుకున్నారు.
మడకశిర రూరల్ : మండలవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకు న్నట్లు మండల విద్యాధికారి భాస్కర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మండలంలోని మొత్తం 119 పాఠశాలల్లో ఎన్నికలు నిర్వహించినట్లు తెలిపారు. పాఠశాలలకు ఎన్నికైన చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామికి కృతజ్ఞతలు తెలిపారు.
అగళి : మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు సజావుగా నిర్వహించారు. మోడల్ పాఠశాలలో జడ్పీటీసీ ఉమేష్‌తోపాటు ప్రిన్సిపాల్ జాఫర్ సమక్షంలో చైర్‌పర్సనగా ఆశ , వైస్ చైర్‌పర్సనగా సరస్వతిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జడ్పీటీసీ, ప్రిన్సిపాల్ వారికి డిక్లరేషన అందజేశారు. ఆయా పాఠశాలల్లో చైర్మన, వైస్ చైర్మనలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు విద్యాశాఖాధికారులు తెలిపారు.
గుడిబండ: మండలంలో 55 ప్రాథమిక, రెండు ప్రాథమికోన్నత, 10జడ్పీ ఉన్నత పాఠశాలలకు ఎన్నికలు నిర్వహించి చైర్మన, వైస్ చైర్మనల ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తిమ్మాపురం ప్రాథమికోన్నత పాఠశాలలో పోటీ ఎక్కువగా ఉండటంతో వాయిదా పడినట్లు ఎంఈఓ గంగప్ప తెలిపారు.
మడకశిర : అమరాపురం మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో పాఠశాల యాజమాన్య కమిటీల ఎన్నికలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. చైర్మన, వైస్ చైౖర్మన ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీడీపీ మండల కన్వీనర్ గణేష్, మాజీ జడ్పీటీసీ నరసింహమూర్తి, ఎస్సీ సెల్ నాయకుడు జయకుమార్, టీఎనటీయూసీ రామచంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....