Share News

DUMPYARD : నగరానికి పొగ

ABN , Publish Date - Jul 19 , 2024 | 11:54 PM

కనుచూపు మేరలో కొండలు.. పచ్చ పచ్చని వృక్షాలు.. కమ్ముకున్న పొగ మంచు.. కశ్మీరు లోయ అందాలను తలపిస్తున్నాయి కదా..? కనిపించేదంతా నిజం కాదు..! ఇది డంపింగ్‌ యార్డు చిమ్ముతున్న విషం..!...

DUMPYARD : నగరానికి పొగ

కనుచూపు మేరలో కొండలు.. పచ్చ పచ్చని వృక్షాలు.. కమ్ముకున్న పొగ మంచు.. కశ్మీరు లోయ అందాలను తలపిస్తున్నాయి కదా..? కనిపించేదంతా నిజం కాదు..! ఇది డంపింగ్‌ యార్డు చిమ్ముతున్న విషం..!

గుత్తి రోడ్డు డంపింగ్‌ యార్డు నుంచి విష వాయువులు రోజూ ఇలా అనంతపురం నగరాన్ని కమ్మేస్తున్నాయి. దట్టమైన పొగ, దుర్వాసన కారణంగా గుత్తి రోడ్డు వెళ్లే వాహనదారులు శుక్రవారం సాయంత్రం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.


ముక్కులు మూసుకుని వేగంగా అక్కడి నుంచి బయట పడేందుకు ప్రయత్నించారు. ఎదురుగా వచ్చే వాహనాలు సైతం కనిపించనంత పొగ అలుముకుంది. వేల టన్నుల చెత్త పేరుకుపోవడం, తరచూ నిప్పు అంటుకోవడంతో ఈ సమస్య తలెత్తుతోంది. చుట్టుపక్కలవారు రోగాలబారిన పడుతున్నారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు వీలైనంత త్వరగా ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు.

- అనంతపురం క్రైం


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 19 , 2024 | 11:54 PM