Share News

drinking water problem తాగునీటి సమస్య తీర్చండి

ABN , Publish Date - Dec 31 , 2024 | 01:24 AM

కంబదూరు మండల పరిధిలోని అండేపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో గుక్కెడు నీరు దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ గ్రామ మహిళలు సోమవారం ఖాళీబిందెలను చేతపట్టుకుని స్థానిక రోడ్డుపై బైఠాయించి వాహనరాకపోకలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు.

 drinking water problem తాగునీటి సమస్య తీర్చండి

- ఖాళీ బిందెలతో మహిళల ఆందోళన

కళ్యాణదుర్గం, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి) : కంబదూరు మండల పరిధిలోని అండేపల్లిలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, దీంతో గుక్కెడు నీరు దొరక్క తీవ్ర ఇబ్బంది పడుతున్నామని, వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఆ గ్రామ మహిళలు సోమవారం ఖాళీబిందెలను చేతపట్టుకుని స్థానిక రోడ్డుపై బైఠాయించి వాహనరాకపోకలను నిలిపివేసి ఆందోళన చేపట్టారు.


ఒకటిన్నర నెల నుంచి గ్రామంలో తాగునీటి ఎద్దడి నెలకొందని మహిళలు వాపోయారు. ఎన్నిసార్లు అధికారులకు విన్నవించినా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉన్నారన్నారు. సుమారు రెండు గంటలపాటు ప్రధాన రహదారిలోనే వాహనరాకపోకలు నిలిపివేయడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్పందించిన ఈవోఆర్డీ గూడెన్న రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించుకున్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Dec 31 , 2024 | 01:24 AM