ANJANEYA SWAMY : కసాపురంలో ప్రత్యేక పూజలు
ABN , Publish Date - Aug 28 , 2024 | 12:31 AM
కసాపురం దేవస్థానంలో శ్రావణ మాస నాలుగవ, చివరి మంగళవారం రోజున ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, పరిచారకులు తెల్లవారుజామునే నెట్టి కంటి ఆంజనేయ స్వామి విరాట్టుకు అభిషేకాలు, అలంకారాలు చేశారు. ఆలయంలో హనుమాన చాలీసా, సుందరకాండ పారాయణాలు చేశారు. మధ్యాహ్నం మహా మంగళహారతిని నిర్వహించారు. రాత్రి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను వెండి రథంపై ఉంచి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు.
గుంతకల్లు, ఆగస్టు27: కసాపురం దేవస్థానంలో శ్రావణ మాస నాలుగవ, చివరి మంగళవారం రోజున ఉత్సవ కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు, పరిచారకులు తెల్లవారుజామునే నెట్టి కంటి ఆంజనేయ స్వామి విరాట్టుకు అభిషేకాలు, అలంకారాలు చేశారు. ఆలయంలో హనుమాన చాలీసా, సుందరకాండ పారాయణాలు చేశారు. మధ్యాహ్నం మహా మంగళహారతిని నిర్వహించారు. రాత్రి సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి ఉత్సవ విగ్రహాలను వెండి రథంపై ఉంచి ప్రాకారోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ధ ర్మాజీ, ఏఈఓ మల్లికార్జున, ధర్మకర్తల మండలి చైర్‌పర్సన కే సుగుణమ్మ, గుంతకల్లు, కసాపురం, దోసలుడికి, చెన్నప్పకొట్టాల, తదితర గ్రామాల నుంచి భక్తులు ప్రాకారోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో ఆలయ సూపరింటెండెంటు పీ వెంకటేశులు, ప్రధానార్చకులు గరుడాచార్యులు, అనంతాచార్యులు, రాఘవాచార్యులు, సిబ్బంది నాగేశ్వరరెడ్డి, వేమన్న, అర్చకులు, పరిచారకులు సిబ్బంది పాల్గొన్నారు.
ర్శించుకున్నారు.
నేమకల్లులో...
బొమ్మనహాళ్, ఆగస్టు 27: నేమకల్లు ఆంజనేయస్వామి ఆల యం హనుమంతుడి నామస్మర ణతో మార్మోగింది. శ్రావణమాసం నాల్గవ మంగళవారం బ్రహ్మోత్స వాల్లో భాగంగా విశేషపూజలు జరి గాయి. ప్రధాన అర్చకులు అనిల్ కుమారా చార్యులు, సంతోష్‌కు మారార్యులు పూజలు నిర్వహిం చారు. సుప్రభాతసేవ, పంచామృ తాభిషేకం, నిర్మాల్య విసర్జన, విష్ణు సహస్రనామ పారాయణం, సుం దరకాండ పారాయణం నిర్వహించా రు. స్వామి మూలవిరాట్‌ను వెన్నతో అలంకరించారు. ఈ సందర్భంగా కర్ణాటక ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామివారిని ద
మరిన్ని అనంతపురం వార్తల కోసం....