Share News

KRISHNASHTAMI : సంతాన వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు

ABN , Publish Date - Aug 28 , 2024 | 12:22 AM

పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వా మి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను యాదవులు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. స్వామివారికి బంగారు కవచధారణ చేశారు. ఉత్సవవిగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. వినాయకసర్కిల్‌ వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంచేపట్టారు.

KRISHNASHTAMI : సంతాన వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు
Venugopalaswamy in Rayadurgam

రాయదుర్గంరూరల్‌, ఆగస్టు27: పట్టణంలోని సంతాన వేణుగోపాలస్వా మి దేవాలయంలో కృష్ణాష్టమి వేడుకలను యాదవులు భక్తి శ్రద్ధలతో నిర్వ హించారు. స్వామివారికి బంగారు కవచధారణ చేశారు. ఉత్సవవిగ్రహాన్ని పురవీధుల్లో ఊరేగించారు. వినాయకసర్కిల్‌ వద్ద ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ప్రత్యేక పూజలు చేశారు. ఆల య కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంచేపట్టారు.


యాదవసం ఘం నాయ కులు బంగి ఉమాశంకర్‌, నాయకులు రామస్వామి, బంగి రమేష్‌, టీడీపీ మండల కన్వీనర్‌ హనుమంతు, నాయకులు తిమ్మారెడ్డి, రామకృష్ణ, బాల య్య, సర్పంచ వన్నూరుస్వామి, మల్లేశప్ప తదితరులు పాల్గొన్నారు. రాయదుర్గం మండలంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను యాదవ కులస్థులు మంగళవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. రాధాకృష్ణుల చిత్రప టాలను, విగ్రహాలను ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ్ల ఊరేగింపు కార్యక్రమాలు నిర్వహించారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 28 , 2024 | 12:22 AM