Share News

COLLECTOR: క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం

ABN , Publish Date - Aug 15 , 2024 | 12:16 AM

క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక బుడ్డప్పనగర్‌లోని రాజేంద్రనగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సింథటిక్‌ బాస్కెట్‌బాల్‌ కోర్టును కలెక్టర్‌, ఎమ్మెల్యే దగ్టుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ప్రారంభించారు.

COLLECTOR: క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం
Collector inaugurating the basketball synthetic court, MLA

అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 14: క్రీడలతోనే మానసిక, శారీరక ఉల్లాసం, ఆరోగ్యం లభిస్తుందని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. బుధవారం స్థానిక బుడ్డప్పనగర్‌లోని రాజేంద్రనగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన సింథటిక్‌ బాస్కెట్‌బాల్‌ కోర్టును కలెక్టర్‌, ఎమ్మెల్యే దగ్టుపాటి వెంకటేశ్వర ప్రసాద్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో క్రీడానైపుణ్యానికి కొదవలేదని, క్రీడలను, క్రీడాకారులను మరింత ప్రోత్సాహిస్తామన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం క్రీడలు, క్రీడాకారులకు ప్రాఽధాన్యం ఇస్తుందన్నారు. డీఎ్‌సడీఓ షఫీ, నగరపాలక కమిషనర్‌ మూర్తి, జిల్లా బాస్కెట్‌బాల్‌ అసోసియేషన కార్యదర్శి నరేంద్ర చౌదరి, ప్రధానోపాఽధ్యాయుడు రామాంజనేయులు పాల్గొన్నారు.


జీవో 117 మేరకు సర్దుబాటు సరికాదు

అనంతపురం విద్య: ప్రభుత్వం మిగులు టీచర్లను సర్దుబాటు చేస్తోందని, జీవో 117 టీచర్ల సర్దుబాటు సరికాదని, పునరాలోచించాలని ఎస్టీయూ, ఏపీటీఎఫ్‌ నాయకులు, టీచర్లు ఎమ్మెల్యేను కోరారు. బుధవారం రాజేంద్రమున్సిపల్‌ హైస్కూల్‌కు వెళ్లిన ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను వారు కలిశారు. వారు మాట్లాడుతూ జీఓ 117 ప్రకారం ఇంటర్‌ మేనేజ్‌మెంట్‌ పద్ధతిలో ఉపాధ్యాయులను సర్దుబాటు చేస్తే అనేక మంది టీచర్లు మిగులు జాబితాలో చేరతారన్నారు. ఆ జీవోను రద్దు చేసిన తర్వాత సర్దుబాటును కొనసాగించాలని సూచించారు. సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అం దించారు. రామాంజనేయులు, ఓబులేసు, నాగేంద్ర, విజయభాస్కర్‌రెడ్డి, యుగంధర్‌, శ్రీనివాసులు, లోకయ్య, రవీంద్ర పాల్గొన్నారు.

Updated Date - Aug 15 , 2024 | 12:16 AM