Share News

Sri Satya Sai ఆలోచింపజేసిన విద్యతోనే విముక్తి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:39 PM

జైపూర్‌ విద్యార్థులు చేపట్టిన విద్యతోనే విముక్తి నాటిక భక్తులను ఆలోచింపజేసింది. రాజస్తాన భక్తులు పర్తియాత్రగా ఆదివారం స్థానిక ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఉదయం సాయికుల్వంత సభామండపంలో శ్రీసత్యసాయి అష్టోత్తర శతనామావళి పఠనం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

Sri Satya Sai ఆలోచింపజేసిన విద్యతోనే విముక్తి
విద్యతోనే విముక్తి నాటికలోని దృశ్యం

పుట్టపర్తి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): జైపూర్‌ విద్యార్థులు చేపట్టిన విద్యతోనే విముక్తి నాటిక భక్తులను ఆలోచింపజేసింది. రాజస్తాన భక్తులు పర్తియాత్రగా ఆదివారం స్థానిక ప్రశాంతి నిలయానికి చేరుకున్నారు. ఉదయం సాయికుల్వంత సభామండపంలో శ్రీసత్యసాయి అష్టోత్తర శతనామావళి పఠనం, పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సాయంత్రం విద్యార్థులు విద్యతోనే విముక్తి నాటికను ప్రదర్శించారు. విలువలతో కూడిన ఉత్తమ విద్యను అభ్యసించిన వారికి ఉన్నతపదవులతోపాటు సమాజంలో గౌరవ మర్యాదలు, భగవంతుని కృపాకటాక్షాలు ఉంటాయంటూ నాటిక ద్వారా తెలియజేశారు. విద్యార్థుల అద్భుత నటనను చూసి భక్తులు తన్మయత్వం పొందారు. అనంతరం సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:39 PM