Share News

CONFERENCE: విజయవాడలో రేపు భూబాధితుల రాష్ట్ర సదస్సు

ABN , Publish Date - Aug 27 , 2024 | 12:16 AM

భూబాధితుల రాష్ట్ర సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించనున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు.

CONFERENCE: విజయవాడలో రేపు భూబాధితుల రాష్ట్ర సదస్సు
Leaders unveiling posters

అనంతపురం విద్య, ఆగస్టు 26: భూబాధితుల రాష్ట్ర సదస్సు బుధవారం విజయవాడలో నిర్వహించనున్నట్లు సీపీఐ నగర కార్యదర్శి శ్రీరాములు పేర్కొన్నారు. సోమవారం ఆ పార్టీ కార్యాలయంలో సదస్సు పోస్టర్లను ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో రాజకీయ నాయకులు భూ దాహానికి ఎంతో మంది పేదలు బలైపోయారన్నారు. ఎస్సీ,ఎస్టీలకు సంబంధించిన భూములు, చుక్కల భూములు, అసైన్డ భూ ములు అన్యాక్రాంతమయ్యాయన్నారు. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి దూర ప్రాంతాల్లో ఉన్నవారి భూములను వైసీపీలో పలుకుబడి ఉన్న రాజకీయ పెద్దలు ఆక్రమించేశారన్నారు. 28న జరిగే రాష్ట్ర సదస్సుకు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు. సీపీఐ నగర సహాయ కార్యదర్శి రమణ, అల్లిపీరా, ఏఐవైఎఫ్‌ జిల్లా కార్యదర్శి సంతోష్‌, ఏఐటీయూసీ నగర కార్యదర్శి కృష్ణుడు, నారాయణస్వామి, శ్రీనివాస్‌, బంగారు బాషా, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


శింగనమల: భూబాధితుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు చిన్నప్పయాదవ్‌, సీపీఐ కార్యదర్శి నారాయణస్వామి పిలుపునిచ్చారు. సొమవారం స్థానిక సీపీఐ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ బుధవారం విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భూకబ్జాలు, కుంభకోణాలపై భూ బాధితుల సదస్సు నిర్వహిస్తునామన్నారు. కార్యాక్రమానికి పెద్ద ఎత్తున రైతులు, కార్యకర్తలు తరలిరావాలని పిలుపునిచ్చారు. మధుయాదవ్‌, మునిస్వామి, నేసే మధు, వెంకటరెడ్డి, నారప్ప పాల్గొన్నారు.

Updated Date - Aug 27 , 2024 | 12:16 AM