CRIME: గొడవలకు దిగితే కఠిన చర్యలు
ABN , Publish Date - Jun 01 , 2024 | 11:45 PM
కౌంటింగ్ రోజు గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. స్ధానిక వనటౌన పోలీస్ స్టేషనలో శనివారం ఎన్నికల కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వనటౌన, టూటౌన, రూరల్ పోలీసులతో సమావేశం నిర్వహించారు.
గుంతకల్లు టౌన, జూన 1: కౌంటింగ్ రోజు గొడవలకు దిగితే కఠిన చర్యలు తీసుకుంటామని ఏఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి హెచ్చరించారు. స్ధానిక వనటౌన పోలీస్ స్టేషనలో శనివారం ఎన్నికల కౌంటింగ్ రోజున తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వనటౌన, టూటౌన, రూరల్ పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పట్టణంలో 144 సెక్షన అమల్లో ఉందని, నలుగురి కంటే ఎక్కువ మంది గుమికూడదన్నారు. 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందని పోలీసుల ముందస్తు అనుమతి లేనిదే ర్యాలీలు, సమావేశాలను నిర్వహించరాదన్నారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నప్పుడు కానీ, తరువాత కానీ ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు, ఊరేగింపులు చేయరాదన్నారు. ఎన్నికల ఫలితాల రోజున విద్యార్థులు, యువత అనవసరంగా రోడ్లపైకి వచ్చి గొడవల్లో ఇరుక్కొని మీ బంగారు భవిష్యతను నాశనం చేసుకోవద్దన్నారు. అనంతరం మొబైల్ పార్టీలు, క్యూఆర్‌టీ టీం, రక్షక్, బ్లూకోల్ట్ టీమ్‌తో సమావేశం అయ్యారు. సీఐలు రామసుబ్బయ్య, గణేష్, మహేశ్వర్‌రెడ్డి, ఎస్‌ఐలు సురేష్, దుగ్గిరెడ్డి, రంగస్వామి పాల్గొన్నారు.
విడపనకల్లు: కౌంటింగ్ రోజు ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిషేధించినట్లు పోలీసులు తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల్లో విడపనకల్లు ఎస్‌ఐ ఖాజా హుస్సేన ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బలగాలుతో ఆయా గ్రామా ల్లో శనివారం పర్యటించారు. ఎస్‌ఐ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆ పార్టీల నాయకులు, కార్యకర్తలు 4వ తేదీన విజయోత్సవ ర్యాలీలు నిర్వహించరాదన్నారు. ప్రజలు ఎన్నికల కోడ్‌ను గుర్తుంచుకుని పోలీసులకు సహాకరించాలన్నారు. ప్రత్యేక పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
గుత్తి: ఎన్నికల కౌంటింగ్ రోజున ఎవరైనా అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ నబీరసూల్ హెచ్చరించారు. స్ధానిక పోలీస్ స్టేషన ఆవరణలో రాజకీయ పార్టీల నాయకులతో శనివారం సాయంత్రం సమావేశం నిర్వహించారు. మాట్లాడుతూ కౌంటింగ్ రోజున 144సెక్షన, 30 పోలీస్ యాక్టు అమల్లో ఉందన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
కళ్యాణదుర్గంరూరల్: ఎగ్జిట్ పోల్స్ విడుదల సందర్భంగా ఎటువంటి హింసాత్మక ఘటనలకు పాల్పడకుండా ప్రజలు దూరంగా వుండాలని పోలీసులుసూచించారు. శనివారం డీఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో పట్టణంలో ఫ్లాగ్ మార్చ్, మాక్‌డ్రిల్‌తో ప్రజలకు అవగాహన కల్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ ఫలితాల కోసం ప్రజలు ఎదురుచూస్తూ వుండటంతో గొడవలకు పాల్పడకుండా పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. అనుమానాస్పద వ్యక్తుల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు 4వ తేదీన విడుదలవుతున్న నేపథ్యంలో ముందస్తు చర్యల్లో భాగంగా కార్డెన సెర్చ్ చేశారు. ప్రజలందరూ స్వేచ్ఛా వాతావరణంలో వుండాలని ఎవరైనా గొడవలు, అల్లర్లు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.