AP ELECTIONS : కౌంటింగ్‌కు కట్టుదిట్టంగా ఏర్పాట్లు
ABN , Publish Date - May 19 , 2024 | 12:22 AM
సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌కు ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జేఎనటీయులో కౌంటింగ్ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. జూన 4న కౌంటింగ్ జరుగుతుందని, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాలలో బారికేడ్స్ ఏర్పాటు చేయాలని, వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ..
కలెక్టరు వినోద్ కుమార్
అనంతపురంటౌన, మే 18: సార్వత్రిక ఎన్ని కల కౌంటింగ్‌కు ఏర్పాట్లు కట్టుదిట్టంగా ఉండాలని కలెక్టరు డాక్టర్ వినోద్ కుమార్ అధికారులకు ఆదేశించారు. జేఎనటీయులో కౌంటింగ్ ఏర్పాట్లను శనివారం ఆయన పరిశీలించారు. జూన 4న కౌంటింగ్ జరుగుతుందని, అధికారులు సిద్ధంగా ఉండాలని సూచించారు. కౌంటింగ్ కేంద్రాలలో బారికేడ్స్ ఏర్పాటు చేయాలని, వంద మీటర్ల దూరంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు.
జేఎనటీయులో ఈవీఎంలు భద్రపరిచిన సా్ట్రంగ్ రూమ్‌లను పరిశీలనకు వచ్చే అభ్యర్థుల కోసం హంపి హాస్టల్‌లో ప్రత్యేక గది ఏర్పాటు చేశామని కలెక్టరు తెలిపారు. అందులో ఉన్న సీసీ టీవీల ద్వారా సా్ట్రంగ్‌రూమ్‌లను చూడవచ్చని తెలిపారు. ఆయన వెంటన జేసీ కేతనగార్గ్, నోడల్ అధికారులు ఓబులరెడ్డి, అప్పాజీ, డీఎస్పీలు ప్రతాప్, మునిరాజు తదితరులు ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం....