Share News

Teacher ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి

ABN , Publish Date - Dec 29 , 2024 | 11:36 PM

కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. పుట్టపర్తి మండలం బీడుపల్లి ఉన్నతపాఠశాలలో ఎస్టీయూ వార్షిక కౌన్సిల్‌ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు.

Teacher ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలి
మాట్లాడుతున్న ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి

ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి

కొత్తచెరువు, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి డిమాండ్‌ చేశారు. పుట్టపర్తి మండలం బీడుపల్లి ఉన్నతపాఠశాలలో ఎస్టీయూ వార్షిక కౌన్సిల్‌ సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన రఘునాథరెడ్డి మాట్లాడుతూ.. 12వ పీఆర్సీ కమిషన నియమించి, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. సీపీఎస్‌, జీపీఎ్‌సలను రద్దుచేసి, పాత పెన్షనవిధానాన్ని కొనసాగించాలన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.25వేల కోట్ల బకాయిలను వెంటనే మంజూరు చేయాలనీ, ఏకీకృత సర్వీసు రూల్స్‌ సమస్యలను పరిష్కరించాలన్నారు. 1998-2008 ఎంపీఎస్‌ ఉపాధ్యాయుల ఉద్యోగ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలనీ, దశల వారీగా వారిని రెగ్యులర్‌ చేయాలన్నారు. 2003 డీఎస్సీ అభ్యర్థులకు పాత పెన్షన విధానాన్ని అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం జిల్లా, రాష్ట్రస్థాయిలో ఉత్తమ అవార్డులు పొందిన ఉపాధ్యాయులను ఎస్టీయూ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు హరిప్రససాద్‌రెడ్డి, ఆ సంఘం నేత గోపాల్‌ నాయక్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి వేమయ్య, సీనియర్‌ నాయకులు ప్రసాద్‌, వెంకటేశ్వర్లు, పాల్గొన్నారు.

Updated Date - Dec 29 , 2024 | 11:36 PM