Share News

విద్యార్థులు మొక్కలు నాటాలి’

ABN , Publish Date - Jul 30 , 2024 | 11:30 PM

మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని సూరప్పనేని విద్యాసాగర్‌ ఫౌండేషన వ్యవస్థాపకుడు విద్యాసాగర్‌ సూచించారు. మంగళశారం నాగలమడకలోని చోళరాయచెరువు ప్రాంతంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

విద్యార్థులు మొక్కలు నాటాలి’

పావగడ, జూలై 30: మొక్కలు నాటడం ప్రతి విద్యార్థి జీవితంలో అలవర్చుకోవాలని సూరప్పనేని విద్యాసాగర్‌ ఫౌండేషన వ్యవస్థాపకుడు విద్యాసాగర్‌ సూచించారు. మంగళశారం నాగలమడకలోని చోళరాయచెరువు ప్రాంతంలో గురుకుల పాఠశాల విద్యార్థులతో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రకృతి ద్వారా మనం ఎన్నోఉపయోగాలు పొందుతున్నామని, అందుకే ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడం, సీడ్‌బాల్స్‌ విసరడం అలవర్చుకోవాలని అటవీశాఖ అధికారి శివప్ప తెలిపారు. ఈ సందర్భంగా గురుకుల విద్యాసంస్థ కార్యదర్శి ఎనసీ నాగభూషణ్‌, సెమివృక్షసమితి అధ్యక్షులు లోకేష్‌, పీడీఓ హనుమంతరాయప్ప, విద్యార్థులు పాల్గొన్నారు.

Updated Date - Jul 30 , 2024 | 11:30 PM