IJETHAMA: సున్నీ ఇజ్‌తెమాను జయప్రదం చేయండి
ABN , Publish Date - Dec 01 , 2024 | 12:20 AM
జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న 15వ వార్షిక సున్నీ ఇజ్‌తెమాను జయప్రదం చేయాలని వక్ఫ్ బోర్డు సభ్యుడు, ముతవల్లిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎం షకీల్ షఫి కోరారు.
అనంతపురం కల్చరల్, నవంబరు 30(ఆంధ్రజ్యోతి): జిల్లాకేంద్రంలో నిర్వహించనున్న 15వ వార్షిక సున్నీ ఇజ్‌తెమాను జయప్రదం చేయాలని వక్ఫ్ బోర్డు సభ్యుడు, ముతవల్లిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేఎం షకీల్ షఫి కోరారు. స్థానిక జామియా మసీద్‌లో సున్నీ ఇజ్‌తెమాకు సంబంధించిన పోస్టర్లను శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా షకీల్ షఫి మాట్లాడుతూ తెహరీక్ ఫైజానే ఉమర్ ఫారుక్ సంస్థ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో డిసెంబరు 22న ఇజ్‌తెమాను నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి మధ్యప్రదేశకు చెందిన అబ్దుల్ ఖాదీర్ ముఖ్య అతిథిగా హాజరై ఆధ్యాత్మిక సందేశమిస్తారన్నారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో తెహరీక్ అధ్యక్షుడు హసనరజాసాబ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు దాదాగాంధీ, టీడీపీ ముస్లిం మైనార్టీ నాయకుడు తాజుద్దీన, ఐఎంఎం రాష్ట్ర అధ్యక్షుడు మహబూబ్‌బాషా, ఆవాజ్ వలి, ముతవల్లి ఫరీదుద్దీన, పర్వీష్, తదితరులు పాల్గొన్నారు.