Share News

Ayyappa శరణం అయ్యప్ప..

ABN , Publish Date - Dec 27 , 2024 | 12:20 AM

అయ్యప్ప నామస్మరణతో పట్టణం గురువారం మార్మోగింది. బెంగళూరు రోడ్డు, సూరప్పకట్టకింద, కిరికెర, ముద్దిరెడ్డిపల్లిలో అయ్యప్పస్వామి మండలపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.

Ayyappa శరణం అయ్యప్ప..
కిరికెర అయ్యప్ప ఆలయంలో స్వామికి అలంకరణ

ఘనంగా హరిహరి పుత్రుని మండలపూజ

భక్తిశ్రద్ధలతో అగ్నిగుండ ప్రవేశం... అలరించిన భక్తిగీతాలు

హిందూపురం అర్బన, డిసెంబరు 26(ఆంధ్రజ్యోతి): అయ్యప్ప నామస్మరణతో పట్టణం గురువారం మార్మోగింది. బెంగళూరు రోడ్డు, సూరప్పకట్టకింద, కిరికెర, ముద్దిరెడ్డిపల్లిలో అయ్యప్పస్వామి మండలపూజ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే ఆలయాల్లో మూల విరాట్లకు అభిషేకాలు, అర్చనలు, హోమాలు చేశారు. మూల విరాట్లను పూలు, నగలతో సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. ఆలయాల్లో భక్తులు ఆలపించిన అయ్యప్ప, ఇతర దేవతామూర్తుల కీర్తనలు మిన్నంటాయి. పాటలతో పరవశింపజేశారు. బెంగళూరు రోడ్డులోని అయ్యప్ప ఆలయంలో భక్తులు అగ్నిగుండ ప్రవేశం ద్వారా భక్తిని చాటారు.

Updated Date - Dec 27 , 2024 | 12:20 AM