BESTA SANGAM: శ్రీకృష్ణపై దాడి చేసిన మూకలపై చర్యలు తీసుకోండి
ABN , Publish Date - Nov 12 , 2024 | 12:20 AM
సార్వత్రిక ఎన్నికలకు ముందు సిద్ధం సభలో ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని బెస్త సేవా సంఘం నాయకులు జిల్లా ఎస్పీ జగదీ్‌షను కోరారు.
అనంతపురం అర్బన, నవంబరు 11(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికలకు ముందు సిద్ధం సభలో ‘ఆంధ్రజ్యోతి’ ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన అల్లరి మూకలపై కఠిన చర్యలు తీసుకోవాలని బెస్త సేవా సంఘం నాయకులు జిల్లా ఎస్పీ జగదీ్‌షను కోరారు. ఈమేరకు డీపీఓలో సోమవారం నిర్వహించిన ప్రజాసమస్యల పరిష్కార వేదికలో వినతి పత్రం అందించారు. అప్పుడు దాడికి పాల్పడినవారిలో ఒకరిని మాత్రమే రిమాండ్‌కు తరలించారన్నారు. మిగిలిన ఏ ఒక్కరినీ పోలీసులు అరెస్టు చేయలేదన్నారు. వైసీపీ నాయకుల ఒత్తిడితోనే దాడికి పాల్పడిన మూకలను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించా రు. ఇప్పటికైనా శ్రీకృష్ణపై దాడికి పాల్పడిన వారిని తక్షణమే అరెస్టు చేయడంతోపాటు, వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలన్నారు. భవిష్యతలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మూకలపై రౌడీ షీట్ ఓపెన చేసి, జిల్లా నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు, ఉపాధ్యక్షుడు రమేష్, ప్రధాన కార్యదర్శి భాస్కర్, కోశాధికారి నాగేంద్ర, నగర ప్రధాన కార్యదర్శి చేపల హరి, నాయకులు నాగరాజు, వెంకీ ఎస్పీకి వినతి పత్రం సమర్పించారు.