Share News

APIIC MD : పారిశ్రామికాభివృద్ధికి చొరవ చూపండి

ABN , Publish Date - Dec 02 , 2024 | 11:36 PM

ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని ఏపీఐఐసీ ఎండీ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు. అనంత ఉమ్మడి జిల్లాలో సోమవారం ఆయన ప ర్యటించారు.

APIIC MD : పారిశ్రామికాభివృద్ధికి చొరవ చూపండి
Commissioner Abhishikt Kishore inspecting the District Office of the Industries Department

అనంతపురం అర్బన, డిసెంబరు 2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి జిల్లాలో పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక చొరవ చూపాలని ఏపీఐఐసీ ఎండీ, పరిశ్రమల శాఖ కమిషనర్‌ అభిషిక్త్‌ కిషోర్‌ ఆదేశించారు. అనంత ఉమ్మడి జిల్లాలో సోమవారం ఆయన ప ర్యటించారు. తొలుత శ్రీసత్యసా యి జిల్లా పుట్టపర్తిలోని ఏపీఐఐ సీ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుహానా సోనీ, అక్కడి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ తర్వాత జిల్లా పరిశ్రమల శాఖ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో పలు అంశాలపై ఆరా తీశారు. ఉమ్మడి జిల్లాలో ఏఏ రకాల పరిశ్రమలు స్థాపించారు..? ఇంకా ఏఏ పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఔత్సాహికులు ఆసక్తి చూపుతున్నారన్న అంశాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పారిశ్రామికవాడలను మరింత అభివృద్ధి చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వం అందించే సబ్సిడీ వివరాలను క్షేత్ర స్థాయిలో ఔత్సాహికులకు తెలియజేసి, పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేలా చొరవ చూపాలన్నారు. కార్యక్రమంలో ఏపీఐఐసీ జోనల్‌ మేనేజర్‌ సుహానా సోనీ, జిల్లా పరిశ్రమల శాఖ జీఎం శ్రీధర్‌, ఏడీ రాజశేఖర్‌రెడ్డి, ఐపీఓలు రవీంద్రనాథ్‌రెడ్డి, భువనేశ్వరి, నిషాంత తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 02 , 2024 | 11:36 PM