heart attack గుండెపోటుతో టీడీపీ కార్యకర్త మృతి
ABN , Publish Date - Nov 08 , 2024 | 12:46 AM
పట్టణంలోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటున్న టీడీపీ కార్యకర్త కోనంకి వెంకటరమేష్‌నాయుడు (45) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు.
తాడిపత్రి, నవంబరు 7(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని టీచర్స్‌కాలనీలో నివాసం ఉంటున్న టీడీపీ కార్యకర్త కోనంకి వెంకటరమేష్‌నాయుడు (45) గురువారం గుండెపోటుతో మృతిచెందాడు.
కోనంకి వెంకటరమేష్‌నాయుడు గ్రానైట్, లారీల ట్రాన్సపోర్టు వ్యాపారం చేస్తూ జీవనం సాగించేవాడు. గురువారం ఉదయం ఆకస్మాత్తుగా ఛాతిలో నొప్పి ఉందంటూ ఇంటిలోనే కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి, నాయకుడు ఎస్వీ రవీంద్రారెడ్డి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. మృతుడికి భార్య రుక్మిణి, కుమారుడు శ్రీధర్, కుమార్తె అపర్ణ ఉన్నారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..