TDP flexi టీడీపీ ఫ్లెక్సీని చించేసిన వైసీపీ మూకలు
ABN , Publish Date - Jun 14 , 2024 | 12:15 AM
చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని తలమర్ల గ్రామంలో టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాగా వైసీపీ మూకలు జీర్ణించుకోలేక బుధవారం రాత్రి ఆ ఫ్లెక్సీని చించేశారు.
-పోలీసులకు ఫిర్యాదు
కొత్తచెరువు, జూన 13: చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని తలమర్ల గ్రామంలో టీడీపీ నాయకులు శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. కాగా వైసీపీ మూకలు జీర్ణించుకోలేక బుధవారం రాత్రి ఆ ఫ్లెక్సీని చించేశారు.
దీనిపై గురువారం స్థాని క టీడీపీ నాయకులు సీఐ రాజారమేశకు ఫిర్యాదు చేశారు. అనంతరం టీడీపీ నాయకులు బోయసూరి, వెంకటరెడ్డి, చండ్రాయుడు మాట్లాడుతూ.. వైసీపీ నాయకులు ఓటమిని భరించుకోలేక ఇలాంటి చిల్లర పనులు చేయడం తగదన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వారిపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలని కోరారు.
మరిన్ని అనంతపురం వార్తల కోసం..