Share News

SP : థ్యాంక్యూ.. వెళ్లొస్తా..!

ABN , Publish Date - Jul 16 , 2024 | 11:40 PM

ఎలాంటి హడావుడి లేకుండా ఎస్పీ గౌతమి శాలి విధుల నుంచి మంగళవారం రిలీవ్‌ అయ్యారు. ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయబోయినా.. ఆమె సున్నితంగా తిరస్కరించారు. జిల్లా పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజల సహకారం మరువలేనని ఆమె అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రిలీవ్‌ అవుతున్న సందర్భంగా పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఆమె మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ఎస్పీగా అతి తక్కువ కాలం పని చేసినా తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. జిల్లా...

SP : థ్యాంక్యూ.. వెళ్లొస్తా..!
Speaking SP

ఎస్పీ గౌతమి శాలి రిలీవ్‌.. రేపు కొత్త ఎస్పీ బాధ్యతల స్వీకరణ

అనంతపురం క్రైం, జూలై 16: ఎలాంటి హడావుడి లేకుండా ఎస్పీ గౌతమి శాలి విధుల నుంచి మంగళవారం రిలీవ్‌ అయ్యారు. ఆమెకు ఘనంగా వీడ్కోలు పలికేందుకు జిల్లా పోలీసు అధికారులు, సిబ్బంది ఏర్పాట్లు చేయబోయినా.. ఆమె సున్నితంగా తిరస్కరించారు. జిల్లా పోలీసు సిబ్బంది, అధికారులు, ప్రజల సహకారం మరువలేనని ఆమె అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. రిలీవ్‌ అవుతున్న సందర్భంగా పోలీస్‌ కాన్ఫరెన్స హాల్‌లో ఆమె మంగళవారం మాట్లాడారు. జిల్లాలో ఎస్పీగా అతి తక్కువ కాలం పని చేసినా తనకు సంతృప్తి కలిగిందని అన్నారు. జిల్లా ప్రజలు ముక్కుసూటి కలవారని అన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో ఎస్పీగా బాధ్యతలు


చేపట్టినా, పరిస్థితులు చక్కబడేవిధంగా ప్రజలు, పోలీస్‌ సిబ్బంది తన వెంట నడిచి సహకరించారని అన్నారు. జిల్లా యంత్రాంగం, మీడియా ప్రతినిధులు, పోలీసు సిబ్బంది, రాజకీయపార్టీల నాయకులు, ప్రజలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గౌతమి శాలిని విజయవాడ డీసీపీగా ప్రభుత్వం బదిలీ చేసింది. ఆమె స్థానంలో అనకాపల్లి ఎస్పీ కేవీ మురళీకృష్ణను జిల్లా ఎస్పీగా నియమించారు. ఆయన బుధవారం రాత్రికి జిల్లా కేంద్రానికి చేరుకుని, గురువారం బాధ్యతలు స్వీకరిస్తారని తెలిసింది.

ఆలయాలను సందర్శించిన ఎస్పీ

తాడిపత్రి: పట్టణంలోని చింతల వెంకటరమణస్వామి ఆలయాన్ని ఎస్పీ గౌతమిశాలి మంగళవారం సందర్శించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అనంతరం ఆనందవల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి ఆలూరుకోనకు వెళ్లి శ్రీదేవిభూదేవి సమేత రంగనాథస్వామివారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. అర్చకులు ఎస్పీని వేదమంత్రాలతో ఆశీర్వదించి, ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందించారు. అంతకుమునుపు ఎస్పీకి ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఎస్పీ వెంట డీఎస్పీ జనార్దననాయుడు, సీఐలు నాగేంద్రప్రసాద్‌, లక్ష్మికాంతరెడ్డి, సిబ్బంది ఉన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం..

Updated Date - Jul 16 , 2024 | 11:40 PM