Share News

FEMALE INDUSTRIALISTS: భవిష్యత్తు యువతదే

ABN , Publish Date - Dec 08 , 2024 | 12:20 AM

ఆధునిక భవిష్యత్తు యువతదేనని ఽథండర్‌సాఫ్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సుధారాణిపిళ్లై అన్నారు. శనివారం బీడుపల్లి సంస్కృతిగ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్స నిర్వహించిన 4.0 యుగంలో అబివృద్ధి చెందుతున్న దేశంలో మహిళల పాత్ర కార్యక్రమంలో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

FEMALE INDUSTRIALISTS: భవిష్యత్తు యువతదే
Women entrepreneurs with students

పుట్టపర్తిరూరల్‌, డిసెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆధునిక భవిష్యత్తు యువతదేనని ఽథండర్‌సాఫ్ట్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ వైస్‌ప్రెసిడెంట్‌ సుధారాణిపిళ్లై అన్నారు. శనివారం బీడుపల్లి సంస్కృతిగ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్స నిర్వహించిన 4.0 యుగంలో అబివృద్ధి చెందుతున్న దేశంలో మహిళల పాత్ర కార్యక్రమంలో పలువురు మహిళా పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు. పిళ్లై మాట్లాడుతూ ఈవెంట్‌ కెరీర్‌, కెరీర్‌మార్గాలను ఊహించడం, పారిశ్రామికరంగంలో మహిళల పరివర్తన ప్రభావాన్ని, భవిష్యత్తును రూపొందించడం తదితర ఆర్థవంతమైన చర్చలను నిర్వహించారు. విభిన్నరంగాలలో మహిళల అత్యుత్తమ నైపుణ్యాలను, అంకితభావం ఆవిస్కరణలపై వక్తలు వివరించారు. కార్యక్రమంలో బెంగళూరు అపరేషనల్‌ ఎక్సలెన్సు యూనివర్సిటీ హెఓడీ రీతూశర్మ, యూనివర్సటీ రిలేషన్స అకడమిక్‌ పార్ట్‌నర్‌ పాలో అల్టో అకాడమీ ప్రతినిధి రేశ్మినెబంపిల్లి, యాక్సెంచర్‌ ప్రాజెక్టు మేనేజర్‌ సిందునాథయ్య, అసిస్టెంట్‌ వైస్‌ప్రెసిడెంట్‌ ఎఫ్‌పీ ఏ సింక్రోని, అలేఖ్య, సంస్కృతి గ్రూప్‌ ఆఫ్‌ ఇనస్టిట్యూషన్స డీన బాలకోటేశ్వరి పాల్గొన్నారు.

Updated Date - Dec 08 , 2024 | 12:20 AM