RTC: విలీనం నష్టాన్ని భర్తీ చేయాలి
ABN , Publish Date - Jun 17 , 2024 | 12:12 AM
ఏపీఎస్ ఆర్టీసీని గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు కలిగిన నష్టాన్ని నూతన ప్రభుత్వం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీకే భవనలో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడారు.
ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు దామోదరరావు
అనంతపురం కల్చరల్, జూన 16: ఏపీఎస్ ఆర్టీసీని గత వైసీపీ ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత ఉద్యోగులకు కలిగిన నష్టాన్ని నూతన ప్రభుత్వం భర్తీ చేసేలా చర్యలు తీసుకోవాలని ఎంప్లాయీస్ యూనియన రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని వీకే భవనలో నిర్వహించిన ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన ప్రాంతీయ కమిటీ సమావేశంలో ఆయన మా ట్లాడారు. విలీనం వల్ల ఉద్యోగులు పాత పెన్షన విధానానికి దూరమవడం... ఆర్టీసీలో దశాబ్దాలుగా ఉద్యోగుల భాగస్వామ్యంతో ఉన్న ఎస్‌ఆర్‌బీఎస్ తదితరపెన్షన పథకాన్ని రద్దు చేయడం.. రెఫరల్ ఆస్పత్రుల్లో వైద్య సౌకర్యాలు పొందే వెసులుబాటును తొలగించడం వల్ల ఉద్యోగులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్నారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరిస్తుందన్న నమ్మకంతో ఉన్నామని, భవిష్యతలో ఉద్యోగుల నమ్మకాలు వమ్ము చేయకుండా న్యాయం చేయాలని కోరారు. అనంతరం వైఎ్‌సఆర్ యూనియన నుంచి 90 మంది సభ్యులు ఎంప్లాయీస్ యూనియనలోకి చేరారు. వారికి దామోదరరావు ఎర్ర కండువాలు కప్పి స్వాగతించారు. ఈయూ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి జీవీ నరసయ్య, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా చైర్మన దివాకర్‌రావు, నబిరసూల్, జోనల్ అధ్యక్ష కార్యదర్శులు కుమార్, రాజశేఖర్, ఏజీటీయూసీ రాష్ట్ర కార్యదర్శి రాజారెడ్డి, జిల్లా కార్యదర్శి రాజే్‌షగౌడ్, కొండయ్య, ఓబుళరత్నం, కల్లప్ప, జీవైపీ రావు, జీవీ నరసయ్య, భాస్కర్‌రెడ్డి, గోపాల్, వెంకటేశ్వర్లు, సోమశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి పాల్గొన్నారు.