AMILENI ROADSHOW: చేతకాని మాటలు మాట్లాడే వాడే.. డేరాబాబా
ABN , Publish Date - May 08 , 2024 | 11:42 PM
చేతకాని మాటలు మాట్లాడేవాడే డేరాబాబా అని వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడుపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నిప్పులు చెరిగారు. మండలంలోని ఎస్ కోనాపురం గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ముప్పులకుంట, పిల్లలపల్లి, సూగేపల్లి, కోనాపురం, సంతే కొండాపురం, ఎర్రకొండాపురం, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో అమిలినేని ప్రచారం చేశారు.
ఉమామహేశ్వర్‌పై అమలినేని ఆగ్రహం
బ్రహ్మసముద్రం, మే 8: చేతకాని మాటలు మాట్లాడేవాడే డేరాబాబా అని వైసీపీ నాయకుడు ఉమామహేశ్వర నాయుడుపై కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు నిప్పులు చెరిగారు. మండలంలోని ఎస్ కోనాపురం గ్రామంలో బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా రోడ్‌షో నిర్వహించారు. ముప్పులకుంట, పిల్లలపల్లి, సూగేపల్లి, కోనాపురం, సంతే కొండాపురం, ఎర్రకొండాపురం, నాగిరెడ్డిపల్లి గ్రామాలలో టీడీపీ మండల కన్వీనర్ పాలబండ్ల శ్రీరాములు ఆధ్వర్యంలో అమిలినేని ప్రచారం చేశారు. ఆయనకు టీడీపీ సీనియర్ నాయకులు, మహిళలు, గ్రామస్థులు పూలవర్షం కురిపించి గజమాలతో ఘన స్వాగతం పలికారు. అమిలినేని మాట్లాడుతూ మనం వుండటానికి మన అవసరం కోసం తాత్కాలిక షెడ్డు వేసుకుంటే దాన్ని డేరా అంటారా? అసలు డేరా నీ దగ్గరే ఉందని ఉమాపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ ఇచ్చిన డబ్బులు మిగుల్చుకున్న దానితో నువ్వు వేసుకున్న డేరా అని ప్రజలే చెప్పుకుంటున్నారన్నారు. నువ్వు ఉన్న కాలనీకి ఉమానగర్ అని పెట్టుకున్నావని, అది లింగాయతలకు చెందిన భూమిలో లేఔట్ వేసి రైతులను మోసం చేసి సంపాదించింది కాదా అని ప్రశ్నించారు. సోసైటీలను మోసం చేసిన చరిత్ర మాది కాదన్నారు. ఇలాంటి మాటలు మాట్లాడటం సరికాదని హితవు పలికారు. నీతి నిజాయితీగా పనిచేసి ప్రజల నుంచి మంచి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకుంటానన్నారు. బీటీపీ కాలువ పూర్తి చేసి సాగు, తాగు నీరు అందిస్తానన్నారు.
వైసీపీ మేనిఫెస్టోలో బొమ్మలు తప్ప అభివృద్ధి, సంక్షేమ పథకాలు ఒక్కటి కూడా లేవని, అదే టీడీపీ మేనిఫెస్టోలో ప్రతి వర్గానికి అవసరమైన పథకాలు పొందుపరిచామని, 12 అంశాలతో ఈ ప్రాంత అభివృద్ధికి మేనిఫెస్టో కూడా ఇచ్చామన్నారు. బ్రహ్మసముద్రం మండలానికి తాగు, సాగు నీరు అందించి ప్రజలకు మంచి చేస్తామన్నారు. గ్రామంలో ఇంటి స్థలాలు ఇచ్చి ఇల్లు మంజూరు చేస్తామని భరోసా ఇచ్చారు. ఉన్న సమస్యలు పరిష్కరించి అన్ని రకాలుగా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. కుటుంబానికి ఆర్థిక భద్రతతో పాటు భావితరాల భవిష్యత్తు బాగుండాలంటే విజన వున్న నాయకుడు చంద్రబాబుతోనే సాధ్యమన్నారు. అందరూ సమష్టిగా కృషి చేసి చంద్రబాబును సీఎంగా గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేయాలని పిలుపునిచ్చారు. పల్లెప్రాంతాలన్నీ అభివృద్ధి లేక అధ్వాన స్థితికి చేరుకున్నాయన్నారు.
అభివృద్ధిని ఆలోచించి సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకునే దిశగా వుండాలన్నారు. అప్పుడే మన ఊరు మన ప్రాంతం అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంటుందన్నారు. 13వ తేదీన ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తుకు ఓటు వేసి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించాలని అభ్యర్థించారు. మాజీ ఎంపీపీ రామచంద్రప్ప, సర్పంచ కొల్లాపురమ్మ, వనిత, మల్లికార్జున, సందీప్‌కుమార్, మాజీ కన్వీనర్లు, మాజీ సర్పంచలు, క్లస్టర్ ఇనచార్జిలు ఓబులేసు, నాగరాజు, నియోజకవర్గ సీనియర్ నాయకులు, బ్రహ్మసముద్రం మండల సీనియర్ టీడీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.