Share News

COLLECTOR: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం

ABN , Publish Date - Sep 07 , 2024 | 12:01 AM

దేశం, సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక బుడ్డప్పనగర్‌లో ఉన్న నెహ్రూ యువకేంద్రం కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు.

COLLECTOR: దేశాభివృద్ధిలో యువత పాత్ర కీలకం
Collector Vinodkumar watering plants in Enayke office premises

అనంతపురం క్లాక్‌టవర్‌, సెప్టెంబరు 6: దేశం, సమాజాభివృద్ధిలో యువత పాత్ర కీలకమని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ అన్నారు. శుక్రవారం స్థానిక బుడ్డప్పనగర్‌లో ఉన్న నెహ్రూ యువకేంద్రం కార్యాలయాన్ని కలెక్టర్‌ సందర్శించారు. కేంద్రప్రభుత్వం నెహ్రూయువకేంద్రం ద్వారా నిర్వహిస్తున్న అభివృద్ధి కార్యక్రమాలపై ఎనవైకే ప్రోగ్రాం ఇనచార్జి శ్రీనివాసులును అడిగి తెలుసుకున్నారు. అనంతరం కార్యాలయంలో కలెక్టర్‌ మొక్కలు నాటారు. జాతీయ యువజన అవార్డు గ్రహీత బిసాటి భరత, ఎస్‌ఆర్‌ ఎడ్యుకేషనల్‌ సొసైటీ వ్యవస్థాపకులు సుంకర రమేష్‌, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు జీవనకుమార్‌, జయమారుతి, సాయిట్రస్టు వ్యవస్థాపకుడు విజయసాయి, సామాజిక సేవాకార్యకర్తలు రామకృష్ణారెడ్డి, మహే్‌షబాబు పాల్గొన్నారు.

Updated Date - Sep 07 , 2024 | 12:01 AM