Share News

Shanmukha Sharma : నిత్యారాధనతో పరమేశ్వరుడి కటాక్షం

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:59 AM

నిత్య ఆరాధనతో పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. రామకృష్ణ సేవాసమితి 20వ వార్షికోత్సవాన్ని నగరంలోని ఓ ఫంక్షన హాల్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓం సంగీత నృత్య శిక్షణాలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్య బృందం కోలాటం, నృత్య ప్రదర్శనలతో సామవేదం షణ్ముఖ శర్మను 3వ రోడ్డు నుంచి ఫంక్షన హాల్‌ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఫంక్షన హాల్‌లో శ్రీ నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి శిష్యబృందం శివపదం నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. అనంతరం...

Shanmukha Sharma : నిత్యారాధనతో పరమేశ్వరుడి కటాక్షం
Samaveda Shanmukha Sharma doing spiritual prophecy

బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ

అనంతపురం కల్చరల్‌, జూలై 27: నిత్య ఆరాధనతో పరమేశ్వరుడి కటాక్షం ప్రాప్తిస్తుందని బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. రామకృష్ణ సేవాసమితి 20వ వార్షికోత్సవాన్ని నగరంలోని ఓ ఫంక్షన హాల్‌లో శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఓం సంగీత నృత్య శిక్షణాలయం నాట్యాచార్యురాలు దేవరకొండ కౌసల్య బృందం కోలాటం, నృత్య ప్రదర్శనలతో సామవేదం షణ్ముఖ శర్మను 3వ రోడ్డు నుంచి ఫంక్షన హాల్‌ వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఫంక్షన హాల్‌లో శ్రీ నృత్యకళానిలయం నాట్యాచార్యురాలు సంధ్యామూర్తి శిష్యబృందం శివపదం నృత్యరూపకాన్ని ప్రదర్శించింది. అనంతరం ‘శివసాక్షాత్కారం’ అంశంపై సామవేదం షణ్ముఖశర్మ భక్తులకు అనుగ్రహభాషణం చేశారు. ఓంకార, స్వాహాకార, స్వధాకార, వషట్కార, నమస్కారాలనే


పంచప్రణవాలతో కూడిన, వాటికి లక్ష్యమైన మోక్షరూపబ్రహ్మమే శివపరమాత్మ అని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరి హృదయంలో ప్రకాశించే ఆనంద స్వరూపుడే శివుడని అన్నారు. మనలో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ అనే పంచకోశాలలో ప్రకాశించే చైతన్యరూపమైన పరమాత్మను మన శరీర క్షేత్రంలో ఉండే అంతర్యామిగా పరమేశ్వరుడిని దర్శించాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా న్యాయాధికారి శ్రీనివాస్‌, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షుడు డాక్టర్‌ శ్రీకృష్ణశశి, కార్యదర్శి ప్రవీణ్‌, సహాయ కార్యదర్శి శ్రీధరమూర్తి, వేణుగోపాల్‌, సంధ్యామూర్తి, శ్రీవల్లి తదితరులు పాల్గొన్నారు.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Jul 28 , 2024 | 12:59 AM