Share News

Dumping yard : అవినీతి పొగ

ABN , Publish Date - Aug 14 , 2024 | 12:44 AM

అనంతపురం డంపింగ్‌యార్డ్‌లో అవినీతి పొగ ఆగడం లేదు. దొంగ బిల్లుల పేరుతో దోపిడీకి తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నగరంలోని గుత్తి రోడ్డులో దాదాపు 13 ఎకరాల్లోని డంపింగ్‌యార్డ్‌లో బయోమైనింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. నోవా్‌సగ్రీన అనే సంస్థ ఈ కాంట్రాక్టు చేపట్టింది. ఏడాదిన్నర సమయానికి రూ.23కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. రోజూ 120 టన్నుల చెత్త పోగవుతోంది. 3.32లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయాల్సి ఉంది. కానీ ఆ పని జరగలేదు. ఈ క్రమంలో ఏడాది కంటే తక్కువ సమయంలో మొత్తం వర్క్‌ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. చేయకపోయినా రూ.9 కోట్ల పనులకు బిల్లు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదంతా ఎన్నికల ప్రక్రియ ముందు వరకు జరిగిన వ్యవహారం. ఇక్కడితో ఆగలేదు. అవినీతి చేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు. ...

Dumping yard : అవినీతి పొగ
Dumping yard

డంపింగ్‌యార్డ్‌ పనిలో దొంగ బిల్లు...?

రూ.రెండు కోట్ల కోసం విశ్వప్రయత్నాలు

మరోసారి కాంట్రాక్టు సంస్థ ఒత్తిళ్లు

అనంతపురం క్రైం, ఆగస్టు 13: అనంతపురం డంపింగ్‌యార్డ్‌లో అవినీతి పొగ ఆగడం లేదు. దొంగ బిల్లుల పేరుతో దోపిడీకి తరచూ ఏదో ఒక ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. నగరంలోని గుత్తి రోడ్డులో దాదాపు 13 ఎకరాల్లోని డంపింగ్‌యార్డ్‌లో బయోమైనింగ్‌ ప్రక్రియ నిర్వహించారు. నోవా్‌సగ్రీన అనే సంస్థ ఈ కాంట్రాక్టు చేపట్టింది. ఏడాదిన్నర సమయానికి రూ.23కోట్ల అంచనాతో పనులు చేపట్టారు. రోజూ 120 టన్నుల చెత్త పోగవుతోంది. 3.32లక్షల మెట్రిక్‌ టన్నుల చెత్తను బయోమైనింగ్‌ చేయాల్సి ఉంది. కానీ ఆ పని జరగలేదు. ఈ క్రమంలో ఏడాది కంటే తక్కువ సమయంలో మొత్తం వర్క్‌ పూర్తి చేశామని చెప్పుకొచ్చారు. చేయకపోయినా రూ.9 కోట్ల పనులకు బిల్లు చేశారనే ఆరోపణలున్నాయి. ఇదంతా ఎన్నికల ప్రక్రియ ముందు వరకు జరిగిన వ్యవహారం. ఇక్కడితో ఆగలేదు. అవినీతి చేయాలని పట్టుదలగా ప్రయత్నిస్తున్నారు.


రూ.2 కోట్ల బిల్లు కోసం యత్నాలు...

ఎన్నికల తరువాత కూడా డంపింగ్‌యార్డ్‌లో బిల్లులు చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రూ.2కోట్ల బిల్లుతో ఓ ఫైల్‌ ముందుకెళ్లింది. ఇంజనీరింగ్‌ అధికారుల సంతకాలతో వెళ్లిన ఆ ఫైల్‌పై కమిషనర్‌ సైతం చేశారు. అయితే చివరికి ఎగ్జామినర్‌ వద్ద ఆ ఫైల్‌కు బ్రేక్‌ పడింది. కొర్రీ వేస్తూ ఆ ఫైల్‌ను తిరస్కరించారు. గతంలో చేసిన రూ.9కోట్ల పనుల్లో రూ.4కోట్లకు ఆ కమిషనర్‌ ఉన్నప్పుడే బిల్లు చేయడం గమనార్హం. ఆయన తాజాగా బదిలీపై వెళ్లారు. ఇప్పుడు ప్రభుత్వం సైతం మారింది. కానీ ఇంకా ఒత్తిళ్లు వస్తూనే ఉన్నాయట. ఆ రూ.2కోట్ల బిల్లు చేయాలంటూ తాజాగా ఆ కాంట్రాక్టు సంస్థ ప్రతినిధి ఎగ్జామినర్‌ వద్దకు వెళ్లారట. ఎవరో రాజకీయ నేత పేరు చెప్పినట్లు సమాచారం. దీంతో మీరు తప్పు చేశారు కాబట్టే రాజకీయ నేతలతో సిఫార్సు చేస్తున్నారని తిప్పి పంపారట. బిల్లు కోసం వైసీపీ నేతలు ఒత్తిడి తెస్తున్నారా..?ఇప్పటికీ వారి మాట వినే వారున్నారా...?లేక ప్రస్తుత అధికారపార్టీ నేతలు ఒత్తిడి తెస్తున్నారా? అనే అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


మరిన్ని అనంతపురం వార్తల కోసం....

Updated Date - Aug 14 , 2024 | 12:44 AM