WATER WORKERS: సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం
ABN , Publish Date - Sep 13 , 2024 | 11:34 PM
బకాయి వేతనాలు, పీఎఫ్, చెల్లించి సత్యసాయి వాటర్ సప్లయ్ పథకాన్ని కాపాడాలని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు.
అనంతపురం న్యూటౌన, సెప్టెంబరు 13: బకాయి వేతనాలు, పీఎఫ్, చెల్లించి సత్యసాయి వాటర్ సప్లయ్ పథకాన్ని కాపాడాలని కార్మిక సంఘం గౌరవాధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఓబులు డిమాండ్ చేశారు. సత్యసాయి బోర్డు కార్యాలయంలో ఎస్‌ఈ ఎహాసాన బాషా ఆధ్వర్యంలో కార్మిక సంఘం నాయకులు అధికారులతో చర్చలు జరిపారు. కార్మిక సంఘం నాయకులు పలు డిమాండ్లను అధికారుల ముందు ఉంచారు. అధికారులు గతంలో చెప్పిన మాటలే మా పరిధిలో ఉన్న వాటిని పరిష్కరిస్తామని, మిగిలినవి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు చేపడతామని చెప్పుకొచ్చారు. దీంతో కార్మిక సంఘం నాయకులు సమ్మతించలేదు. కార్మిక సంఘం నాయకులు సమస్యలు పరిస్కరిస్తేనే సమ్మె విరమిస్తామని స్పష్టం చేశారు. అధికారుల నుంచి శుక్రవారం జరిపిన చర్చల్లో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించి నిరసన తెలిపారు. కార్మికులకు తగిన న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఈశ్వరయ్య, శ్రీనివాసులు నాయకులు తిప్పేస్వామి, మధు, శ్రీరాములు, ప్రసాద్, వన్నూరప్ప, లక్ష్మీరెడ్డి, వీరాంజనేయులు, బాలకృష్ణ, బాబయ్య, రమే్‌షరెడ్డి, ఈశ్వరయ్య పాల్గొన్నారు.